ఐరిష్‌తో రేషన్


Tue,September 11, 2018 01:07 AM

-కనుపాప విధానంలో సరుకుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ సన్నద్ధం
-ఆధార్‌తో అనుసంధానమైనందున సులభతరంగా ప్రక్రియ
-పూర్తిగా అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం
-చర్మవ్యాధులు, చేతి గీతలు అరిగిన వారికి తొలగనున్న ఇబ్బందులు
నీలగిరి: పేద కుటుంబాలకు సబ్సిడీపై రేషన్ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత రానుంది. ఇప్పటివరకు వేలిముద్రల ద్వారా సరుకులను పంపిణీ చేస్తుండగా.. ఇకపై ఐరిష్ (కనుపాప) విధానంలో
లబ్ధిదారులకు రేషన్ అందజేయనున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా కూడా సరుకుల పంపిణీలో అడపాదడపా అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలవుతుండగా మన జిల్లాలోనూ అమలుచేయడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆధార్ నమోదు చేసిన సమయంలోనే చేతి వేలిముద్రలు, ఐరిష్‌ను అనుసంధానం చేసినందున కొత్తగా కార్డుదారుడు, వారి కుటుంబ సభ్యుల నుంచి మరోసారి సేకరించాల్సిన పనిలేదు. ఇప్పుడున్న ఈ-పాస్ మిషన్ల స్థానంలో కొత్తగా ఐరిష్ క్యాప్చర్ యంత్రాలను
అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విధానంతో చర్మవ్యాధులు, చేతి గీతలు అరిగిన వారి ఇబ్బందులు తొలగనున్నాయి.

ఈపాస్ ద్వారా సరుకుల పంపిణీ విధానాన్ని ప్రారంభించిన తర్వాత రూపాయికి కిలో బియ్యం పెద్ద ఎత్తున మిగులు నమోదైంది. ఇన్ని రోజులపాటుగా లబ్ధిదారుల పేరిట సంబంధిత డీలర్లే బియ్యాన్ని బహిరంగంగా పక్కదారి పట్టించేది. వేలిముద్రల ద్వారా సరుకు ల పంపిణీకి అడుగు ముందుకుపడటంతో డీలర్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. వారి ఆగడాలకు చెక్ పడటంతోపాటు కోట్లాది రూపాయల బియ్యం మిగులు కూడా నమోదైంది. జిల్లాలో ప్రతి నెల 4,49,339 రేషన్‌కార్డులుండగా 7 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోటా జిల్లాకు వస్తుంది. ఈ పాస్ అమలు తర్వాత దాదాపు 10 నుంచి 15శాతం మేర బియ్యం మిగులు నమోదవుతుంది. దీంతో రేషన్ సరుకుల పంపిణీలో ప్రభుత్వం దశలవారీగా సంస్కరణలు చేపడుతుం ది. తొలుత రేషన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసి బోగస్‌కార్డులను వేరివేసింది. ఆ తర్వాత ఈ పాస్ యం త్రాలను అందుబాటులోకి తెచ్చి వేలిముద్రల ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈపాస్ విజయవంతం కావడంతో దాదాపుగా సరుకులు పక్కదారి పట్టడం తగ్గిపోయింది.

3వ దశలో జిల్లా.....
ఐరిష్ విధానంతో సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ మూడు దశల్లో సాగనుంది. నల్లగొండ జిల్లాను మూడో దశలో చేర్చారు. ఈమేరకు జిల్లా పౌరసరఫరాల అధికారులకు కమిషనర్ అకూన్ సబర్వాల్ నుంచి ఆదేశాలు అందాయి. ఐరిష్‌కు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఉన్నతాధికారులు పేర్కొనడంతో జిల్లా యంత్రాం గం ఆ దిశగా చర్యలు చేపట్టింది. జిల్లాలో అక్టోబర్ 1 నుంచి ఐరిష్ విధానం అమలుకానుంది. పేద కుటుంబాలకు రాయితీపై అందజేస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో మరింత పారదర్శకత రానుంది. కార్డుదారుల వేలిముద్రల ఆధారంగా ప్రస్తుతం ఈపాస్ యంత్రాల ద్వారా సరుకులు ఇస్తున్నారు. వీటికి ఇప్పుడు అదనం గా ప్రత్యేక డివైజ్‌ను అనుసంధానించనున్నారు. వేలిముద్రల కన్న మరింత సులభంగా అత్యంత వేగంగా ఐరిష్ పద్ధ్దతిలో సరుకులను పంపిణీ చేయనున్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసిన సమయంలోనే లబ్ధిదారుల చేతి వేలిముద్రలు, ఐరిష్‌ను అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కార్డుదారులు, వారి కుటుం బ సభ్యుల వివరాలు మరోసారి ఐరిస్ విధానానికి ప్రత్యేకంగా అందించాల్సిన అవసరం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

4,49,339 రేషన్‌కార్డులు..
జిల్లాలో మొత్తం 991 రేషన్‌షాపుల్లో 4,49,339 రేషన్ కార్డులుండగా 71980.46 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రతి నెల అందిస్తున్నారు. వీటిలో ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 28,908, ఎఫ్‌ఎస్‌సీ కార్డులు 420358 ఏఏపీ కార్డు లు 73 ఉన్నాయి. ఈ కార్డు దారులందరికీ నెలకు 7821.864 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయ డం జరుగుతుంది. విజిలెన్స్ టాస్క్‌పోర్స్ పౌర సరఫరా ల శాఖ రెవెన్యూ అధికారుల తనిఖీల్లో క్వింటాళ్ల కొద్ది రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నట్లు గుర్తించారు. కార్డుదారులు నేరుగా డీలర్‌లకే విక్రయిస్తుండగా వాటిని చాటుమాటుగా పక్కదారి పట్టిస్తున్నారు. ఆయా జిల్లా ల్లో పక్కదారి పడుతున్నట్లుగా సర్కార్ గుర్తించింది. దీని కి అడ్డుకట్టవేయడంలో భాగంగా ఐరిస్ విదానంలో సరుకుల పంపిణీ చేయాలని నిర్ణయించింది.

7.19 మెట్రిక్ టన్నుల బియ్యం.....
జిల్లాలో 991 రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా 71980.46 క్వింటాళ్ల బియ్యాన్ని లబ్ధిదారులకు రూపా యి కేజి చొప్పున అందజేస్తున్నారు. వీటిలో ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు 28912 కార్డుదారులకు 8878.65 క్వింటాల్ల బియ్యం, ఎఫ్‌ఎస్‌సీ కార్డులు 420358 ఏఏపీ కార్డులకు 63096.35 క్వింటాల్ల బియ్యం అందిస్తున్నారు. 73 ఏఏపీ కార్డులకు 540 క్వింటాళ్ల బియ్యాన్ని అందిస్తున్నారు. కేజికి రూపాయి చొప్పున ప్రతి ఆహారభద్రత కార్డుపై ప్రతివ్యక్తికి ఆరు కిలోల బియ్యం, అం త్యోదయ కార్డుదారులకు 35 కేజీల బియ్యం అందిస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారునికి ప్రతిఒక్కరికి 10 కేజి ల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ప్రతినెలా 10 నుంచి 15 శాతం బియ్యం కోటా మిగులుతున్నట్లు అధికారిక లెక్క లు వెల్లడిస్తున్నాయి. ఐరిష్ విధానాన్ని అమలు చేస్తే మరో పదిశాతం వరకు కోటా ఆదా అవుతుందని పౌర సరఫరాల అధికారులు అంచనా వేస్తున్నారు. బయో మెట్రిక్ విధానంలో కుష్టు వ్యాధి గ్రస్తులు, చేతులులేని, వేలిముద్రలు చెరిగిపోయిన లబ్ధిదారులు సరుకులు పొందాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. వీఆర్వో, వీఆర్‌ఏ ధ్రువీకరణతో సరుకులు పంపిణీ చేయగా సద రు అధికారులతో ఉన్న మామూళ్ల బంధంతో పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. ఐరిష్ విధానంలో అక్రమాలకు ఆస్కారం ఉండదు. అక్టోబర్ లోపు జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధ్దంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.

ఐరిష్‌కు అన్ని ఏర్పాట్లు
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల నుం చి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ఐరిస్ తో చౌక ధరల దుకాణా ల్లో సరుకులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా వేలిముద్రలు సరిగ్గాపడని కుష్టువ్యాధి రోగులు, వృద్ధ్దు లు, చేతులు లేని వారు, వేలిముద్రలు చెరిగిపోయిన లబ్ధిదారులందరికీ ఐరిష్‌తో మేలు జరగనుంది. భవిష్యత్‌లో కార్డుదారులందరికీ ఐరిస్‌తో సరుకులు అం దించే అవకాశం ఉంది. ఈ నూతన విధానం కోసం లబ్ధిదారు లు కొత్తగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి వివరాలు ఆధార్‌లింక్‌తో స్వీకరించనున్నాం..
- ఉదయ్‌కుమార్. జిల్లా పౌర సరఫరాల అధికారి, నల్లగొండ

202
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...