వీఆర్వో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి


Tue,September 11, 2018 01:05 AM

నీలగిరి: ఈ నెల 16న నిర్వహించనున్న వీఆర్వో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సూచించారు. కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో సోమవారం ఎస్పీ రంగనాథ్, జేసీ నారాయణరెడ్డిలతో కలిసి వీఆర్వో పరీక్షలపై లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షకు 53,591 మంది అభ్యర్థులు హాజరవుతునందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 169 సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 నుంచి 1.30 వరకు జరగనున్న పరీక్షకు అ న్ని కేంద్రాల్లో మౌలి క సౌకర్యాలు, లైటింగ్ ఫర్నిచర్, డ్యుయల్ డెస్కు బెంచీ లు, కుర్చీలు, బెంచీలు ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు తెలిసేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫొన్లు , ఎలక్ట్రానిక్ గాడ్జెస్ అనుమతి లేదని తెలిపారు. ఎస్పీ రంగనాథ్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంగన్‌వాడి టీచర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లను తగిన సంఖ్యలో చెకింగ్ చేసేందుకు నియమించాలన్నారు. పరీక్ష పత్రాల ట్రెజరీలో భద్రపరిచి ముందు రోజు తగిన బందోబస్తుతో డివిజన్ పోలీస్ స్టేషన్‌కు అ క్కడ నుంచి పరీక్ష కేంద్రాలకు ఎస్కార్టుతో పంపడం జరుగుతుందన్నారు. జేసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ 14న చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు ఎంఈఓ తహసీల్దార్లతో సమన్వయంతో కేంద్రాలలో ఏర్పాటు చేయాలని సమస్యలుంటే డీఈఓ ఇంటర్ విద్యాధికారిని సంప్రదించాలన్నారు.ఈ సమావేశంలో డీఆర్‌వో ఖీమ్యానాయక్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

236
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...