బంద్ పాక్షికం...


Tue,September 11, 2018 01:05 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ/క్రైం : పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా విపక్షాలు చేపట్టిన బంద్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా పాక్షికంగా జరిగింది. జిల్లా కేంద్రంలో పెద్దగా బంద్ ప్రభావం కనిపించకపోయినప్పటికీ మిగతా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు దుకాణాలు, పెట్రోలు బంక్‌లు, ఇతర వ్యాపార సముదాయాలు మూసి వేశారు. బంద్‌ను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగానే విద్యాసంస్థలు సెలవు ప్రకటించాయి.

పాక్షికంగా బంద్ ప్రభావం... నల్లగొండలో ఉదయం ఆరు గంటలకే కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీడీపీ, న్యూడెమోక్రసీ నేతలు బస్టాండ్‌కు చేరుకుని బస్‌లు నిలుపుదల చేశారు. ఆ తర్వాత పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరిగి దుకాణాలు బంద్ చేయడంతో మధ్యాహ్నం వరకు బంద్ నిర్వహించిన వ్యాపారులు తర్వాత ఓపెన్ చేశారు. పెట్రోలు బంక్‌లు సైతం పాక్షికంగా బంద్ కాగా బ్యాంకులు సైతం 12 గంటల వరకే ఓపెన్ చేశారు.

ఆర్టీసికి రూ. 30 లక్షల నష్టం... భారత్ బంద్ కారణంగా ఆర్టీసీకి రూ.30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. జిల్లాలో నల్లగొండతో పాటు నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ బస్ డిపోలు ఉండగా ఆయా డిపోల్లో సోమవారం ఉదయం 6 గంటలకే విపక్షాలు బస్‌లు వెళ్లకుండా ముట్టడించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు బస్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

198
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...