నేడు, రేపు సఫాయి కర్మచారి జాతీయ సభ్యుడి పర్యటన


Mon,September 10, 2018 02:42 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ సభ్యుడు జగదీశ్ సిరేమణి నేడు, రేపు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.30కు జిల్లా కేంద్రానికి చేరుకుని 2 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సఫాయి కర్మచారి అసోసియేషన్ ప్రతినిధులు ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులతో సమావే శం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు సఫాయి కర్మచారి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సాయంత్రం 6 గంటలకు పట్టణంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, ఎస్పీ రంగనాథ్, విజిలెన్స్ కమిటీ సభ్యు లు, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై సఫాయి కర్మచారుల పునరావాసం తదితర అంశాలపై సమీక్షించనున్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...