కారు జోరు.. ప్రతిపక్షం బేజారు..


Sat,September 8, 2018 01:17 AM

-అభ్యర్థుల ప్రకటనతో టీఆర్‌ఎస్‌లో కొత్త ఉత్సాహం
-ఉమ్మడి జిల్లా అంతటా ఎన్నికల మూడ్‌లోకి క్యాడర్
-కేసీఆర్ పూరించిన ప్రచార పర్వంతో మరింత జోష్
-తొలిరోజే జనం మధ్యకు అధికార పార్టీ అభ్యర్థులు
-అయోమయం, అభ్యర్థుల వేటలో ప్రతిపక్ష పార్టీలు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్‌లో ఎన్నికల ఉత్సాహం జోరందుకుంది. గురువారం అసెంబ్లీని రద్దు చేసి ముం దస్తు ఎన్నికల నగారా మోగించిన టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. అదే రోజు 119 స్థానాలకు 105 స్థానా ల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల పేర్లను సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు శుక్రవారం హుస్నాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించి ఎన్నికల ప్రచార పర్వం సైతం ప్రారంభించడంతో.. ఆ పార్టీ క్యాడర్‌లో ఉమ్మడి జిల్లా అంతటా ఉత్సా హం ఊపందుకుంది. 12అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఇప్పటికే 10 మంది అభ్యర్థులను అధికార పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోదాడ, హుజూర్‌నగర్ మిన హా మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లకూ టిక్కెట్లు ఖరా రు చేయడంతో.. శుక్రవారం అంతటా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యే లు, టీఆర్‌ఎస్ అభ్యర్థులు నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఘన విజయం ప్రణాళికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు...
ఎన్నికల షెడ్యూల్ రాక ముందే అభ్యర్థుల పేర్లను ఖరా రు చేయడంతో.. తాము ఘన విజయం సాధించి అధినేత కేసీఆర్‌కు కానుకగా సమర్పించే లక్ష్యంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు శుక్రవారం ప్రణాళికల్లో నిమగ్నమయ్యారు. వచ్చే వారం నుంచి భారీ జన సందోహంతో పూర్తిస్థాయి ప్రచారం ప్రారంభించే దిశగా కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రచార రథాలను సిద్ధం చేసుకోవడం.. నిన్నా మొన్నటి కంటే ఎక్కువగా జనంలోకి వెళ్లేందుకు షెడ్యూల్ తయారు చేసుకోవడంలో బిజీగా గడిపారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. హడావిడి సమావేశాలు నిర్వహించారు. ఎక్క డ ఎవరు అభ్యర్థులుగా ఉంటారా? అన్న అంచనాల్లో ఆ పార్టీ నేతలు ఇప్పటికీ అయోమయంలోనే ఉండగా.. బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ పార్టీలన్నీ అభ్యర్థుల వేట లో మునిగిపోయాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ కారు ముందస్తు ఎన్నికల రేసులో జోరుగా దూసుకెళ్తుంటే.. ప్రతిపక్షాలన్నీ ఆయుధాలను కూడగట్టే పనిలో పడ్డాయి.

246
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...