3 ఎత్తిపోతలు..26,274 ఎకరాలు


Sat,September 8, 2018 01:17 AM

-రూ.457 కోట్ల నిధులు మంజూరు.. ఉత్తర్వులు జారీ
-దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలకు మహర్దశ
-వేలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం..
-అభివృద్ధికీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు
మిర్యాలగూడ,నమస్తేతెలంగాణ: చుట్టూ నదులు, వాగులు ఉన్నా సాగునీరులేక భూములు బీడు భూములుగా మారుతున్నాయి ఈ భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల పరిధి లో రూ.457 కోట్లతో మూడు భారీ ఎత్తిపోతలను మంజూరు చేసింది. దీంతో 17 గ్రామాల పరిధి లో 26,274 వేల ఎకరాలు సాగులోకి రానున్నా యి. ఒకవైపు కృష్ణానది మరోకవైపు మూసీనది, చుట్టూ అన్నవేరు, హాలియా వాగులు ప్రవహిస్తు న్నా దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల పరిధిలో సాగు, తాగునీటికి కరువే.. పుష్కలంగా జలవనరులున్నా గత పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రెండు మేజర్లకు మండలంలోని వజీరాబాద్, ము దిమాణిక్యం గ్రామాల పేర్లు పెట్టినా నీరు మాత్రం ఈ గ్రామాలకు చేరేవి కావు. ఇటీవల సాగర్ ఆధునీకరణ అనంతరం కొంత పరిస్థితి మెరుగుపడినా మేజర్ల ఆరంభంలో నాడు స్థిరీకరించిన ఆయకట్టు కంటే రెట్టింపు ఎకరాల్లో సాగులోకి రావడంతో నీరు చివరిరైతులకు చేరడం లేదు. నేడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా ప్రజలకు ఉపయోగ పడేవిధంగా పథకాలను ఏర్పాటు చేయ డం జరుగుతుంది. అందులోభాగంగానే మూడు ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేయడం జరిగింది. దిగువకు వెళ్లే వాగులు, నదులపై రూ.457 కోట్లతో మూడు భారీ ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి 17 గ్రామ పంచాయితీల పరిధిలో 26,274 ఎకరాలు సాగులోరానున్నాయి. ఈ ఎత్తిపోతల కోసం గత రెండేళ్లుగా మిర్యాలగూడ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు నిరంతరం కృషి చేశారు.

మూసీనదిపై రూ.77 కోట్లతో...
దామరచర్ల మండలం కేశవపురం, కొండ్రపోలు గ్రామాలపరిధిలో మూసీనదిపై రూ.77కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా కేశవాపురం, సాత్‌తండా, తెట్టెకుంట, లావూరితండా, నునావత్‌తండా, జైత్రాంతండా, మంగల్‌దుబ్బతండా, ఎల్‌బీతండా, రామోజీతం డా, ధనియాలబండతండా, కొండ్రపోలు గ్రామా ల పరిధిలో 5,875 ఎకరాల భూములు సాగులోకి రానున్నాయి.

వాడపల్లి వద్ద రూ.190 కోట్లతో...
దామరచర్ల మండలం బొత్తలపాలెం, వాడపల్లి గ్రామాల పరిధిలో కృష్ణానదిపై రూ.190 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో బొత్తలపాలెం, దామరచర్ల, వాచ్యాతండా, తాళ్లవీరప్పగూడెం, ఇర్కిగూడెం, వాడపల్లి పరిధిలో 8,610 ఎకరాలు సాగులోకి రానున్నాయి.

బాల్నేపల్లి రూ.190 కోట్లతో...
కృష్ణానదిపై బాల్నేపల్లి, చాంప్లాతండా గ్రామాల మధ్య దున్నపోతుల గండి వద్ద ఎత్తిపోతల పథ కం రూ.190 కోట్లతో నిరించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ఈ లిఫ్టు వల్ల మొల్కచర్ల, జిలకరకుంటతండా, అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, చాంప్లాతండా, కొత్తనందికొండ, బాల్నేపల్లి, చిట్యాల, ఉల్సయిపాలెం, గ్రామాలపరిధిలో 12,239 ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయి.

బీడు భూములకు అందనున్న నీరు
ఈ ఎత్తిపోతల పథకాల నీటిని ముదిమాణిక్యం, వజీరాబాద్ మేజరు కాల్వలలో వదిలినట్లయితే 17 గ్రామాల ప్రజలకు చెందిన 26,274 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇంతకాలం బీళ్లుగా ఉన్న భూములు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కృషి వల్ల సస్యశ్యామ లం కానున్నాయని ఆయా గ్రామాల రైతులు ఆనం ఎదం వ్యక్తం చేస్తున్నారు.

253
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...