ఎన్నికలకు సిద్ధం అవ్వండి


Sat,September 8, 2018 01:16 AM

-జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం
-కలెక్టర్లు, జేసీలతో సీఈఓ రజత్ కుమార్ సమావేశం
-ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వినియోగంపై అవగాహన
-మంగళవారం నుంచి జిల్లాలో ప్రక్రియ ప్రారంభం
-సాధ్యమైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది. నవంబరులోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో జిల్లా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశించింది. హైదరాబాద్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడారు. జిల్లా నుంచి కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, సూర్యాపేట జిల్లా నుంచి కలెక్టర్ సురేంద్ర మోహన్, డీఆర్వో చంద్రయ్య సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ముం దస్తు ఎన్నికల నిర్వహణకు ఎన్నికల ఏర్పాట్లను మొదలు పెట్టింది. సభ రద్దయిన తర్వాత ఆర్నెళ్ల కంటే ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నందున.. ఆ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియను పరిశీలిస్తోంది. అం దులో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం రాష్ట్రంలోని 31జిల్లాల కలెక్ట ర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. సమావేశానికి హాజరైన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్.. ఈవీఎంలు, వీవీప్యాట్ల వినియోగం పై అవగాహన కల్పించారు. త్వరలోనే జిల్లాలో మాక్ పోల్ నిర్వహణ కోసం ఏర్పా ట్లు చేపట్టాలని.. ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని చెప్పారు. మరోవైపు వీవీ ప్యాట్లు తొలిసారి వినియోగిస్తున్న నేపథ్యం లో సాంకేతిక అవగాహన కోసం జిల్లా అంతటా యంత్రాంగానికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణ.. ఓటర్ల సంఖ్య ఆధారంగా పోలింగ్ సెంటర్ల సంఖ్య, కావాల్సిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల సంఖ్యల పై త్వరగా తేల్చాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున.. జిల్లాలో కూడా ఆలస్యం చేయకుండా మంగళవారం నుంచి అధికారులు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉందని తెలిసింది.

201
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...