కొనసాగుతున్న కంటి వెలుగు పరీక్షలు


Sat,September 8, 2018 01:16 AM

నీలగిరి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో 16వ రోజు శుక్రవారం కొనసాగింది. జిల్లాలో ఇప్పటి వరకు 87242 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. మహిళలు, వృద్ధుల రాకతో పరీక్ష కేంద్రాలు జనసందోహంగా కనిపించాయి. జిల్లా వ్యాప్తంగా 37వైద్య బృందాలు శుక్రవారం 5735మందికి పరీక్షలు చేయగా జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 87242 మందికి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. స్థ్ధానిక ప్రజాప్రతినిధులు పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి రోగులకు కళ్లద్దాలు, మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 32చోట్ల, పట్టణ ప్రాంతాల్లో 5చోట్ల కంటి పరీక్ష కేంద్రాలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 5735 మందికి పరీక్షలు నిర్వహించగా 2534పురుషులు, 3201మంది స్త్రీలు ఉన్నారు. వీరిలో 1175మందికి దగ్గర, దూరం చూపు సమస్య ఉన్న వారికి కళద్దాలు అందజేశారు. మరో 1454 మందికి రెండు కండ్లల్లో చూపు సమస్య ఉన్నట్లు గుర్తించి మూడు వారాల్లో కళ్లద్దాలు అందజేయనున్నారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారిని జిల్లా కేంద్ర దవాఖానలో 492 మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశారు. కార్యక్రమాల్లో మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు కోఆర్డినేటర్లు, ఆఫ్తాలమిస్టులు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...