టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఖరారు


Fri,September 7, 2018 01:22 AM

- ప్రతిపక్షాలకు మరో కోలుకోలేని షాకిచ్చిన సీఎం కేసీఆర్
- అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే అభ్యర్థుల జాబితా వెల్లడి
- ఉమ్మడి జిల్లాలోని 8 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు
- నల్లగొండ, నాగార్జునసాగర్ పార్టీ ఇన్‌చార్జీలకు టికెట్లు
- 12 స్థానాలకు 10 చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు ఖరారు
- హుజూర్‌నగర్, కోదాడకు సైతం త్వరలోనే ప్రకటన
- అభ్యర్థిత్వాల ప్రకటనతో అంతటా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు
నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అసెంబ్లీ రద్దు.. ఆ వెంటనే 105 పేర్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా వెల్లడి.. ముందస్తు వ్యూహంతో సీఎం కేసీఆర్ గురువారం ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన షాక్‌లు ఇవి. అసెంబ్లీ రద్దు చేశారన్న వార్త నుంచి తేరుకోక ముందే అభ్యర్థులను సైతం ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. ముందు నుంచి చెబుతున్నట్టే ఉమ్మడి జిల్లాలోని 8 మంది తాజా మాజీ ఎమ్మెల్యేలకూ త్వరలో జరగనున్న ముందస్తు ఎన్నికల్లో వారి సిట్టింగ్ సీట్లలోనే అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్యలకు సైతం పార్టీ టిక్కెట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్ వెల్లడించిన జాబితా ప్రకారం సూర్యాపేట నుంచి మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. తుంగతుర్తి(ఎస్సీ) నుంచి గాదరి కిశోర్ కుమార్, మిర్యాలగూడ అభ్యర్థిగా నలమోతు భాస్కర్‌రావు, మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్(ఎస్సీ) నుంచి వేముల వీరేశం, దేవరకొండ(ఎస్టీ) నుంచి రమావత్ రవీందర్ కుమార్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి అధికార పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తారు. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు కోదాడ, హుజూర్‌నగర్ మినహా 10 సీట్లకూ అభ్యర్థులను ఖరారు చేయడంతో జిల్లా అంతటా టీఆర్‌ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి.

ప్రజల శేయస్సుకు మంచి నిర్ణయం...
సీఎం కేసీఆర్ అద్భు త సంక్షేమ పథకాలు అమలు చేసి అందరి మన్నలు పొందారు. అసెంబ్లీ రద్దుతో మరో సహసోపేత నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రయోజనాలకే ప్రాధాన్యనిస్తారనే నా నమ్మకం. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిని చేస్తే రాష్ర్టాని భారతదేశ పటంలో ప్రత్యేకంగా నిలుపుతాడనే విశ్వాసం ఉంది. అన్నివర్గాల ప్రజలు ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం.
- గుండు విజయరామారావు,
మైక్రోబయాలజీ అధ్యాపకుడు, నడిగూడెం

సరైన సమయంలోనే అసెంబ్లీ రద్దు
తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో అసెంబ్లీని రద్దు చేసింది. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేంద్రంతోపాటే జరిగేవి. దీంతో ఎన్నికలు స్థానికత ఆధారంగా కాకుండా కేంద్రంలోని పరిస్థితిని బట్టి ఓటును వేయాల్సి వచ్చేది. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికలకు పోతుంది. దీని వల్ల ప్రజలు రాష్ట్ర పరిస్థితులను మాత్రమే పరిగణలోనికి తీసుకోవడానికి అవకాశం ఉంది.
- జక్కుల నాగేశ్వర్‌రావు,
బార్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి, హుజూర్‌నగర్

ముందస్తుకు వెళ్లడం చరిత్రాత్మకం
రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలను తీసుకొచ్చేందుకు నిరంతరంగా శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి సహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉన్న ఓ పార్టీ ఎలాంటి విభేదాలు లేకున్నప్పటికీ అన్ని విధాల ప్రజల మద్దతు ఉండి కూడా ముందస్తు ఎన్నికలకు పోయి ప్రజల తీర్పును కోరడం దేశ చరిత్రలో ఇదే ప్రధమం. ప్రజల తీర్పు కోసం కేసీఆర్ ముందస్తుకు పోవడం శుభపరిణామం. బంగారు తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించడం ఖాయం.
- ఇండ్ల ఉపేందర్,
సీనియర్ రాజనీతి ఉపన్యాసకుడు, మిర్యాలగూడెం

ప్రతిపక్షాలను దెబ్బతీసే ఎత్తుగడ...
రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసే ఎత్తుగడలో భాగంగానే ముందస్తు ఎన్నికలకు ఆలోచన చేయడం జరిగింది. ప్రతిపక్షాలను నిరాయుధులను చేయడానికి ఎన్నికల రణరంగంలో కేసీఆర్ ఆలోచన అబ్ధుతం. ప్రతిపక్షాలు, విపక్షాలను ఆశ్చర్య పరుస్తు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. మానసికంగా సంసిద్ధంగా లేకున్నా వారిని దెబ్బకొట్టడం కోసం ముందస్తు బ్రహ్మస్ర్తాన్ని కేసీఆర్ వేశారు. మరోమారు ఆయన రాజకీయ చాణుక్యుడు అనే పేరును నిలబెట్టుకున్నాడు. ఈ నిర్ణయంతో మరోమారు టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది.
-వేణుసంకోజు, కవి, విమర్శకులు, నల్లగొండ

అసెంబీ ్లరద్దు సహేతుకమే..
గొప్ప సంకల్పంతో అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకోవడం చారితాత్మకం. పోరాడి తెలంగాణను సాధించిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయనంతా అభివృద్ధిని రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయడం హర్షణీయం. బంగారు తెలంగాణ సాధ్యనే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు మరోమారు ముఖ్యమంత్రిగా పట్టం కడతారు.
- వి.రమేష్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు,కొండమల్లేపల్లి

మళ్లీ టీఆర్‌ఎస్‌కే సానుకూలత..
సీఎం కేసీఆర్ ప్రజా ఆమోదయోగ్యమైన ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారు. దేశ వ్యాప్తంగా కూడా కేసీఆర్ పాలనకు మంచి గుర్తింపు వచ్చింది. అసెంబ్లీని రద్దు చేసి వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించడంతో కేసీఆర్ సంకల్పబలం ఎంటో తెలుస్తుంది. ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైన కేసీఆర్‌కు ఉద్యోగులంతా అండగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో టీఆర్‌ఎస్‌కే సానుకూలత ఉంది. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా ఒక్క కేసీఆర్‌కే ఉంది. మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలే అధికారంలోకి తీసుకోస్తారు.
- అంకం చంద్రమౌళి,విశ్రాంత ఉపాధ్యాయుడు, దేవరకొండ

కేసీఆర్ గొప్ప దార్శనికుడు...
సీఎం కేసీఆర్ పాలనలో గొప్ప దార్శనికుడు. పద్నాలుగేళ్లు ఉద్యమం నడిపి తెలంగాణ సాధించిన అనుభవంతోనే రాజకీయ కారణాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం స్వాగతించాల్సిన విషయం. ఇప్పటి వరకు ప్రభుత్వ పనితీరుపై సమీక్షించుకునేందుకు అసెంబ్లీ రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయం. ప్రజల సంక్షేమానికి అమలు చేసిన పథకాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రుజువు చేసుకోవడం నాయకుడికి అవసరం. అలా చేయాలంటే నాయకుడికి ఎంతో సంకల్పబలం కావాలి. కేసీఆర్ పట్టుదల చూస్తుంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయం.
గుంటోజు అంజయ్య, విశ్రాంత ఉద్యోగి, నిడమనూరు

సుపరిపాలన అందించేందుకే...
తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నాడు. గత ప్రభుత్వాలు అందించలేని పాలనను అందించి దానికి ప్రజల మద్దతు తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 460రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించింది. ఈ ఎన్నికలతో ప్రజలు ప్రభుత్వం అందిచే పథకాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలు ప్రతిపక్షాలకు అధికార పక్షానికి అగ్ని పరీక్షలా ఉంటుంది.
- బిట్టు నాగేశ్వర్‌రావు,సీనియర్ అధ్యాపకుడు, సూర్యాపేట

విజయం సాధిస్తామనే నమ్మకంతోనే...
రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో అభివృద్ధి ప్రభుత్వం విజయం సాధిస్తామనే నమ్మకంతోనే అసెంబ్లీని రద్దు చేసింది. కేసీఆర్ ముందస్తుగా ఆరునెలల ముందు అసెంబ్లీని రద్దుచేయడం సాహసోపేత నిర్ణయం. ఏప్రభుత్వాలైన ముందస్తుకు సాహసం చేయవు కానీ కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన నేపధ్యంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన విజయం సాధిస్తుంది. పూర్తికాలం పనిచేస్తే మరిన్ని అభివృద్ధి పనులు కూడ చేసే అవకాశం ఉండేది.
- దీనదయాళ్, న్యాయవాది, తిరుమలగిరి

ముందస్తు నిర్ణయం హర్షణీయం
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం హర్షనీయం. బంగారు తెలంగాణ సాధనకు అహర్ణిషలు కేసీఆర్ కృషి చేస్తున్నారు. నాలుగు సంవత్సారాల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రేవేశ పెట్టి అమలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా తిరుగులేని విజయం సాధించాలి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. దేశం యావత్తు రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా చేయాలంటే మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి.
- రామకృష్ణ, ఉద్యోగి, మాడ్గులపల్లి

టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి..
రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి రావల్సిన వాటా రావాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావలి. కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయడాన్ని స్వాగతించడంతోపాటు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఆయన కృషిని అభినందిస్తున్నాం. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. రాష్ర్టానికి హైకోర్టు రావడంతోపాటు సుప్రీంకోర్టు బెంచి రావాల్సిన అవసరం ఉంది. పునర్ వ్యవస్తీకరణలో ఆస్తి, అప్పుల విషయంలో న్యాయం జరగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ రావల్సిన అవసరం ఉంది.
- జవహర్‌లాల్, సీనియర్ న్యాయవాది, నల్లగొండ

వ్యూహంతోనే అసెంబ్లీ రద్దు నిర్ణయం...
అన్ని వర్గాల ప్రజలకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మంచి చేశాననే సంకల్పంతో అసెంబ్లీని రద్దు చేయడం గొప్ప నిర్ణయం. అంతేకాక 105 స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ప్రకటించిన కేసీఆర్ వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు. తెలంగాణాలో ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజల ముందుకు రావడం మంచి నిర్ణయం. అభివృద్ధిని కొనసాగించడం కోసమే 9నెలల ముందే అసెంబ్లీ రద్దు చేయడం శుభ పరిణామం.
- రాధారపు భిక్షపతి,
విశ్రాంత ఉపాధ్యాయులు, నార్కట్‌పల్లి

ప్రతిపక్షాల గల్లంతు ఖాయం..
ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేయడంతో రాష్ట్రంలో ప్రతి పక్షాలు గల్లంతు కావడం ఖాయం. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకం. కాంగ్రెస్ వారు పలు అభివృద్ధి పనులపై చేస్తున్న అసత్య ఆరోపణలకు ధీటుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి తిరిగి ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడతారు అన్న నమ్మకంతోనే ముందస్తుగా రద్దు. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో మరోమారు టీఆర్‌ఎస్ తన సత్తా చాటుతుంది.
- అమరనాయిని వెంకటేశ్వరావు తొగర్రాయి, కోదాడ

కేసీఆర్ నిర్ణయాలన్నీ సంచలనాత్మకమే
నాడు ఉద్యమ రథసారధిగా, నేడు ఆపద్ధ్దర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయాలన్నీ సంచలనాత్మకమే. ముందుస్తుగా అసెంబ్లీ రద్దు చేసి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే అభ్యర్థులను ప్రకటించడం కూడా మరో సంచలనం. కేవలం నాలుగేళ్లలోనే ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. వాటిని ప్రజలెన్నటికీ మరువరు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.
- ఉన్నం సత్యనారాయణ,తొలి, మలిదశ ఉద్యమకారుడు, సూర్యాపేట

436
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...