భూసేకరణను వేగవంతం చేయాలి


Fri,September 7, 2018 01:21 AM

నీలగిరి : జిల్లాలో జాతీయ రహదారులు 167, 365, 565లకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయరహదారుల భూసేకరణ, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఏజెన్సీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణకు సంబంధించి సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సి. నారాయణరెడ్డి, డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు.

వీఆర్వో పరీక్షలకు ఏర్పాటు చేయాలి : కలెక్టర్
ఈ నెల 16న టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహించే వీఆర్వో పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జేసీ నారాయణరెడ్డి, డీఆర్వో ఖీమ్యానాయక్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 54931 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్లలో అభ్యర్థులకు సహాయపడేలా హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు.

సఫాయ్ కర్మచారుల కమిషన్ సభ్యుల పర్యటనను విజయవంతం చేయాలి
ఈ నెల 10,11 తేదీలలో జిల్లాలో జాతీయ సఫాయ్ కర్మచారుల కమిషన్ సభ్యులు జగదేష్ హిరేమణి పర్యటనను జయప్రదం చేయాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. గురువారం తన చాంబర్‌లో ఎస్సీ, ఎస్టీ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కమిషన్ సభ్యులు ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. 3 గంటలకు నల్లగొండ మున్సిపల్ కమిషనర్, సపాయి కర్మచారి ప్రతినిధులు, అధికారులతో సమావేశం జరుపుతారన్నారు. సాయంత్రం ఆరు గంటలకు స్తానిక పాతబస్తి సందర్శిస్తారన్నారు. 11న ఉదయం 10 గంటలకు కలెక్టర్, ఎస్పీ, జిల్లా విజిలెన్స్ కమిటీ చైర్మన్, సభ్యులు, సాంఘీక సంక్షేమ అధికారి, వైద్య అదికారి, సంబంధిత అధికారులు , సపాయి కర్మచారి నాయకులతో మాన్యువల్ స్కావెంజర్‌లు నియామక నిషేధం, పునరవాసం చట్టం 2013అమలుపై సమీక్షిస్తారని తెలిపారు. జిల్లాలో సఫాయి కర్మచారి కుటుంబాల వివరాలు, వారికి కావాల్సిన పునరావాసంపై నివేదిక సమర్పించాలన్నారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ డీడీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

229
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...