పాఠశాలల్లో పరిశుభ్రత


Thu,September 6, 2018 12:49 AM

ఈ నెల 15వరకు స్వచ్ఛ పక్వాడా అమలు
స్వచ్ఛత ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన
ఆరోగ్య తెలంగాణ ఏర్పాటులో వారి భాగస్వామ్యం

వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా బలంగా ఉంటుందనే విషయాన్ని విద్యార్థి దశలోనే అవగాహన
కల్పించేందుకు ఉద్దేశించిందే స్వచ్ఛ పక్వాడా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15వరకు అన్ని పాఠశాలల్లో ర్వహించనున్నారు. ప్రతీ రోజు విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ ఒక్కో అంశంపై ప్రత్యక్ష అవగాహన కల్పించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. ఉపాధ్యాయులు, అధికారులు సైతం భాగస్వాములై ఆరోగ్య తెలంగాణ నిర్మించేందుకు కృషి చేయనున్నారు.

రామగిరి: స్వచ్ఛపక్వాడా అంటే పరిశుభ్రతా పక్షోత్సవా లు అని అర్ధం. పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వ మానవ వనరుల మం త్రిత్వశాఖ(ఎంహెచ్‌ఆర్డీ), తెలంగాణ ప్రభుత్వం సం యుక్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ వరకు స్వచ్ఛపక్వాడాను నిర్వహిస్తోంది. కార్యక్రమం లో ప్రభుత్వ, జడ్పీ ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, టీఎస్‌ఎంఎస్, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు.

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యం


స్వచ్ఛపక్వాడాలో ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా పాఠశాలల ఆవరణతోపాటు గ్రామీణప్రాంతాల్లో స్వచ్ఛతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్లపై చెత్త వేయకుండా నివారణ చర్యలు తీసుకోవడం, తాగునీటిశుభ్రత, హరితహారంతోపాటు అనేక అంశాలపై విద్యార్థులు భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వారి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

పక్షం రోజులపాటు కార్యక్రమాలు


స్వచ్ పక్వాడాలో భాగంగా పక్షం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
-స్వచ్ఛతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో శపథం చేయించడంతో పాటు పాఠశాలల యాజమాన్య, తల్లిదండ్రుల కమిటీల సమావేశం ఏర్పాటు చేసి పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేయడం, విద్యార్థులకు వ్యాసరచనతో పాటు వివిధ పోటీల నిర్వహణ
-బుధవారం ప్రతి పాఠశాలలో చెత్త బుట్టలు ఏర్పాటు చేయడం, చేత్తను వేరు చేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, ఆకు పచ్చ, నీలిరంగు చెత్త బుట్టలను ఉపయోగించే విధానంపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
-గురువారం పరిశుభ్రత, పాఠశాల ఆవరణ, మరుగుదోడ్ల నిర్వహణపై కాంప్లెక్స్, మండల స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు.
-7న భోజనానికి ముందు, తర్వాత చేతులు కడుగుక్కునే విధనం, దివ్యాంగులైన పిల్లలకు తాగునీటి వసతిపై అవగాహన కల్పించుట, మండల స్థాయిలో నిర్వహించిన పోటీలలో విజేతల నుంచి జిల్లా స్థాయిలో జరిగే పోటీలకు పంపించుట.
-8న పరిశుభ్రతపై విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆడియో-విజువల్ కార్యక్రమాలు రూపొందించి ప్రదర్శించడం, విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు
-9,10 తేదీల్లో సమాజ భాగస్వామ్య దినోత్సవం నిర్వహించి మరుగుదొడ్లు, తాగునీటి వసతి పరిశుభ్రంగా వాడటంపై విద్యార్థులకు అవగాహన, మురుగునీరు, నీటి వృథా ప్రాంతాల పర్యవేక్షణ, వృథా నీ టిని చెట్లకు మళ్లించేందుకు చర్యలు తీసుకోవడం.
-11న స్వచ్ఛతా కార్యక్రమాలకు సంబంధించి ఫొటో, పెయిటింగ్, కార్టునిస్టు, స్లోగన్స్ తదితర అం శాలపై ప్రదర్శన, పాఠశాల స్థాయిలో ఎగ్జిబిషన్స్, డిమానేషన్స్ నిర్వహణ, జిల్లా స్థాయిలో వ్యాసరచన, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయికి విద్యార్థులను ఎంపిక చేయడం.
-12న స్వచ్ఛ నీటి దినోత్సవం, కలుషిత నీరు తాగడం వల్ల సంక్రమించే వ్యాధులపై అవగాహన
-13న నీటి సాగు విధానంపై అవగాహన, వాటర్ హార్వెస్టింగ్, స్టక్చర్స్‌ను నిర్వహించడం.
-14న లెటర్ రైటింగ్ దినోత్సవం నిర్వహించి విద్యార్థులతో గ్రామ సర్పంచ్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తదితరులకు మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతపై ఉత్తరాలు రాయడం.
-15న స్వచ్ఛపక్వాడలో విద్యార్థులు నిర్వహించే కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు అందజేయడం.

199
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...