గోపాల మిత్రల వేతనం పెంపు


Thu,September 6, 2018 12:03 AM

రూ.3500 నుంచి రూ.8500 పెంచిన తెలంగాణ సర్కారు
జిల్లాలో 248 కుటుంబాల్లో వెలుగులు
వెల్లివిరిసిన సంతోషం
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
నల్లగొండ : పశుసంవర్ధకశాఖలో పని చేస్తున్న గోపాలమిత్రల వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం భారీగా పెం చడంతో వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైన మిత్రలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుండగా గుర్తించిన సర్కా రు.. ప్రస్తుతం రూ.3500 ఉన్న వేతనాన్ని రూ.8500 లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో 248 మందికి లబ్ధిచేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంతో గోపాలమిత్రలు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
పశుసంవర్ధకశాఖలో పని చేస్తున్న గోపాలమిత్రల వేతనాన్ని భారీగా పెంచుతూ ఈ నెల 2వ తేదీన రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 248 మంది గోపాలమిత్రలు ఉండగా ఇందు లో 228 మంది ఇప్పటికే విధులు నిర్వహిస్తుండగా మరో 20 మంది శిక్షణలో ఉన్నారు. ఒక్కో గోపాలమిత్ర వేయి పశువులకు ప్రథమ చికిత్స చేయడంతో పాటు కృత్రిమ గర్భధారణ, నట్టల నివారణతో పాటు ఇతర ప్రభుత్వ సేవల్లోనూ పాల్గొంటున్నారు. వీరు పాడి పశువుల పెంపులో ముఖ్యంగా సంకర జాతి పశు సంపద పునరుత్పత్తికి తోడ్పాటు అందిస్తున్నారు. వీరికి ప్రస్తు తం రూ.3500 వేతనం మాత్రమే అందుతోంది. అం దులో రూ.2వేలు ప్రభుత్వం చెల్లిస్తుండగా మరో రూ.1500 పశుగణాభివృద్ధి సంస్థ నుంచి అందుతోంది. తక్కువ వేతనంలో కుటుంబ పోషణ భారమవడంతో గోపాలమిత్రలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వేతనానికి మరో రూ.5వేలు జోడించి మొత్తం రూ. 8500 ఇవ్వాలని నిర్ణయించింది. పెరిగిన వేతనాలు త్వరలో అమలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంది.
17 ఏళ్లుగా రైతుల సేవలో..
పాడి, పశు సంపదను పెంపొందించే లక్ష్యంతో వాటికి కృత్రిమ గర్భధారణ చేయడం కోసం గోపాలమిత్రలను 2001లో నియమించారు. తొలినాళ్లలో ఆరేండ్ల్ల పాటు వారు ఉచిత సేవలు అందించగా 2007 తర్వాత ఒక్కో పశువుకు రూ.10చొప్పున ప్రభుత్వం ఇన్సెంటివ్‌ను ఇ చ్చింది. 2010లో రూ. 1200 వేతనాన్ని ఇచ్చిన ప్రభు త్వం 2013లో వేతనాన్ని రూ. 3500వేలకు పెంచింది. అప్పటి నుంచి అదే వేతనంతో పని చేస్తున్న వారికి తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు పెంచడంతో గోపాలమిత్రలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మమ్మల్ని గుర్తించినందుకు సంతోషంగా ఉంది
ఇప్పటి వరకు చాలీ చాలని వేతనాలతో పని చేస్తున్నాం. ఒక్కో గోపాల మిత్రకు వేయి పశువుల బాధ్యత ఉంది. రైతులకు ఏ బాధ వచ్చినా వెంటనే వెళ్లి చూడటంతో పాటు కృత్రిమ గర్భధారణ చేయడంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ప్రభుత్వం మా సేవలను గుర్తించి ఒకేసారి రూ. 5 వేలు పెంచి రూ. 8500గా వేతనం నిర్ణయించడం సంతోషంగా ఉంది.
-ఎస్.రామకృష్ణారెడ్డి,

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...