ఉమ్మడిజిల్లా గోపాలమిత్రల సంఘం అధ్యక్షుడు


Thu,September 6, 2018 12:03 AM

రేషన్ డీలర్ల న్యాయమైన కోరికలు తీరుస్తాం
విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి జగదీష్‌రెడ్డి
సూర్యాపేట, నమస్తే తెలంగాణ : ఏండ్ల కొద్దీ చాలీచాలని కమీషన్లతో రేషన్ దుఖానాలు నడుపుతున్న డీలర్ల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీరుస్తుందని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కమీషన్ నగదును డీడీల రూపంలో డీలర్లకు అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంవత్సరాల కొద్దీ క్వింటాకు రూ.20కమీషన్‌తోనే రేషన్ దుఖానాలు నడిపారని, వారి సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కమీషన్‌ను మూడున్నర రెట్లు అంటే క్వింటాకు రూ.70పెంచిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాలతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్టు, గురుకులాలు, వ్యక్తికి ఆరు కిలోల రేషన్ బియ్యం, పేదవారికి రెండు పడకల ఇండ్లు తదితర పథకాలు దేశంలో ఏరాష్ట్రంలో లేవని పేర్కొన్నారు.

సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్రమోహన్‌మాట్లాడుతూ అక్టోబర్ 1, 2015 నుంచి 31ఆగస్టు 2018 వరకు జిల్లాలోని 609 రేషన్ డీలర్లకు సుమారు రూ.2,44,86,771 కమీషన్ వచ్చిందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికాప్రకాష్, ఆర్డీఓ మోహన్‌రావు, డీఎం సివిల్ సప్లయ్ రాంపతినాయక్, ఎంపీపీలు కల్పగిరి యశోద, భూక్యా పద్మ, నాగేంద్రబాబు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

193
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...