రోడ్డెక్కిన భూబాధితులు


Thu,September 13, 2018 12:03 AM

సంగారెడ్డి చౌరస్తా/సంగారెడ్డి అర్భన్, నమస్తే తెలంగాణ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాధితులు రోడెక్కారు. ఇటీవల మా నవ అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన జగ్గారెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. మంగళవారం మున్సిపల్ వైస్ చైర్మన్ గోవర్ధన్ నాయక్, గీతా కార్మిక సంఘం నాయకులు శంకర్‌గౌడ్ తదితరులు జగ్గారెడ్డితో ఎదురైన మోసాలను మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అమీన్‌పూర్ భూ బాధితులు జిల్లా పాలనాధికారికి తమ బాధను తెలిపేందుకు తరలివచ్చి జేసీ కలెక్టర్ నిఖిలారెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలు అందజేశారు. అనంతరం వారు విలేకరుల స మావేశంలో వివరాలు వెల్లడించారు. నాటి పటాన్‌చెరు మండల పరిధిలో ని అమీన్‌పూర్ గ్రామంలోని సర్వే నెంబరు 343/17 నుంచి మొదలుకుని వరుసగా 343/32 సబ్ డివిజన్ నెంబర్లలో దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని జగ్గారెడ్డి తన అనుచరులతో అమ్మకానికి పెట్టారు. అధికారుల నివేదికల ఆధారంగా తాము భూమి కొనుగోలు చేసేందుకు మధ్యవర్తులైన మాజీ ఎమ్మెల్యే అనుచరులు వీరేందర్, రాజేందర్‌లు కలిసి తమను సంప్రదించారని తెలిపారు. భూమి కొనుగోలు విషయాన్ని మాట్లాడుకుందామని, హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్‌కు రమ్మని మాజీ ఎమ్మెల్యే తమకు చెప్పారన్నారు. దీంతో డబ్బులతో వెళ్లిన తాము ఆయన భరోసాతో ముందుగా కొంత డబ్బును తెచ్చి ఇవ్వాలని చెప్పిన వెంటనే అందరం కలిసి జగ్గారెడ్డికి డబ్బులు అప్పజెప్పామన్నారు. మిగిలిన డబ్బులను 15 రోజుల తరువాత చెల్లిస్తే తన అనుచరులైన వీరేందర్, రాజేందర్‌లు కలిసి భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తారని నమ్మబలికారన్నారు. ఆ వెంటనే ఆ ఇద్దరు కలిసి తమ వద్దకు వచ్చి మాజీ ఎమ్మెల్యే పంపించారని, డబ్బులు ఇవ్వాలని చెప్పగానే రూ.40 కోట్లకు పైగా ముట్టజెప్పామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేయాలని, నిలదీయగా ఆ భూమికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని విక్రయదారులైన తమకు చెప్పారు. దీంతో రెవెన్యూ అధికారులను కలువగా ఆ భూములపై ప్రభుత్వం విచారణ చేయిస్తుందని చల్లని కబురు ఇచ్చారని వివరించారు. ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి బినామి పేరుతో విక్రయించి సొమ్ము చేసుకున్న ఆయనపై చట్ట రిత్యా చర్యలు తీసుకుని భూ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఈదులనాగులపల్లిలో మరో మోసం...
ఇదిలా ఉండగా రామచంద్రపురం మండలం గ్రామంలోని 134,135 సర్వే నెంబర్లలో మొత్తం విస్తీర్ణం 760 ఎకరాలు వా జిద్ అలీ, కామిల్ కుటుంబ సభ్యులకు వారసత్వంగా సంక్రమించిన భూమిగా ఉన్నదని బాధితుడు బీ వీరేశం విలేకరుల సమావేశంలో వివరించారు. వాజిద్ అలీ కామెల్ కుటుంబ సభ్యుల భూమి సీలింగ్ డిక్లరేషన్ చేయాలని తనకు అప్పగించారని పేర్కొన్నారు. వృత్తిరిత్యా వాజిద్ అలీ కామెల్ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణలో ఉండగా తనకు సీలింగ్ డిక్లరేషన్ పనులను ఆర్డీవో వద్ద చూసుకోవాలని అప్పగించారన్నారు. ఆ భూ మికి సంబంధించిన డిక్లరేషన్ విషయాలను వాజిద్ అలీ కామెల్ కుటుంబ సభ్యులకు ఆర్డీవో 200 ఎకరాలు భూ మి నిర్ధారించారు. ఆ ఆర్డర్‌ను తీసుకున్న తరువాత జగ్గారెడ్డి తనను సంప్రదించి మీ భూమి కొనుగోలు చేసేందుకు నా వద్ద పెద్ద పార్టీ ఉన్నదని, ఆ పార్టీకి అమ్మాలని కోరాడు. ఇందులో 144 ఎకరాలను వాజిద్ అలీ కుటుంబ సభ్యుల ఆమోదంతో తన ప్రమేయంతో విక్రయించడానికి ఒప్పుకుని మొత్తం రూపాయలను చెక్కుల ద్వారా చెల్లిస్తామని వివరించారు. మాజీ ఎమ్మెల్యే బీనామిగా ఉన్న సుఖేశ్‌గుప్తా అనే బంగారం వ్యాపారి, ఇతరుల పేరున రిజిస్ర్టేషన్ చేయాలని చెప్పారన్నారు. తనకు చెక్కులు అందజేసి రిజిస్ట్రేషన్ ఆయన తరువాత ఖాతాలో ఇచ్చిన చెక్కులను జమ చేయగా సేల్ డీడ్ రాసి ఉండడంతో చెక్కులు పాస్ కాలేదన్నారు. సేల్ డీడ్‌ను తీసుకుని మాజీ ఎమ్మెల్యే అతని బినామీ సుకేశ్ గుప్తాతో పాటు జగ్గారెడ్డికి తమ్ముళ్లు అయిన సురేశ్‌బాబు, వెం కటశాస్త్రీలు కలిసి కోర్ ప్రాజెక్టు అనే సంస్థకు రూ.160 కోట్లు తీసుకుని అన్యాక్రాంతం చేశారని చె ప్పారు. దీంతో తమకు అనుమానం వచ్చి వాజిద్ అ లీ కామెల్ తాను కలిసి సుఖేశ్ గుప్తా, ఇతరులకు చె క్కులు చెల్లలేవని నోటీసులు ఇచ్చి కేసు వేశామన్నా రు. తమను నమ్మించి మోసం చేసి ఖాళీ చెక్కులను ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని భూమిని విక్రయించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయన అనుచరులు సుఖేశ్ గుప్తా సోదరులపై 2012లో బీడీఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని వీరేశం తెలిపారు. కేసు వేసిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొని తమను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసి అక్రమ ధనార్జనతో భూమి యజమానులకు డబ్బులు చెల్లించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయనపై కోర్టులో క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నదని గుర్తు చేశారు.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...