మల్కాపూర్ స్ఫూర్తి..ఇతర గ్రామాలకు ఆదర్శం


Tue,September 11, 2018 11:17 PM

తూప్రాన్ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమాల వైపు ఊరు వాడలు కదులుతున్నాయి. తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో 145 వారాలుగా స్వచ్ఛభారత్‌ను నిర్వహిస్తూ అభివృద్ధి పరంగా నేడు రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పేరుపొందింది. అయితే ఇదే స్ఫూర్తితో మండలంలోని కోనాయిపల్లి(పీబీ) గ్రామస్తులు ఏకంగా 365 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేయడంతో 27 రోజులుగా క్రమం తప్పకుండా స్వచ్ఛభారత్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మండలంలోని దాతర్‌పల్లి గ్రామం పరిశుభ్రతపైపు దృష్టి సారించింది. దాతర్‌పల్లి గ్రామంలో మంగళవారం వాడవాడలు కదిలాయి. యువతీయువకులు, వృద్ధులు, మహిళలు స్వచ్ఛభారత్‌ను నిర్వహించడానికి సిద్ధమయారు.

ఇప్పటికే 14 వారాలుగా స్వచ్ఛభారత్‌ను నిర్వహిస్తున్న దాతర్‌పల్లి గ్రామస్తులు సోమవారం నుంచి ప్రతి రోజు క్రమం తప్పకుండా స్వచ్ఛభారత్‌ను నిర్వహించి గ్రామాభివృద్ధికి చొరువ చూపాలంటూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం దాతర్‌పల్లి గ్రామస్తులంతా స్వచ్ఛభారత్ వైపు కదిలారు. గ్రామంలోని వీధులు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, ఖాళీ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలిగించారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ ఎంపీడీవో శ్రీనివాస్‌రా వు, కార్యదర్శి రాజేశ్‌లు మంగళవారం గ్రామానికి చేరుకున్నారు. గ్రా మస్తులు నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమా న్ని చూసి అభినందించా రు. ఎంపీడీవో సైతం స్వచ్ఛభారత్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్‌రా వు మాట్లాడుతూ... గ్రా మస్తులంతా సమష్టిగా కృషిచేస్తే త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రాజేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...