కంటివెలుగుకు విశేష స్పందన


Tue,September 11, 2018 11:17 PM

-18వ రోజు కొనసాగిన కంటి పరీక్షలు
-8,190 మందికి కండ్ల అద్దాల పంపిణీ
-5,044 మందికి కంటి పరీక్షలకు రెఫర్ చేసిన డాక్టర్లు
తూప్రాన్ రూరల్: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని డిప్యూ టీ డీఎంఅండ్‌హెచ్‌వో అరుణశ్రీ చెప్పారు. తూప్రాన్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తూ ప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, వెల్దుర్తి, చేగుంట, నార్సింగి మండలాల్లో కంటివెలుగు శిబిరంలో ప్రజలు అధికంగా పాల్గొంటూ కంటి పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. ఈ ఐదు మండలాల్లో సోమవారం సాయంత్రం నాటికి 13,598 మంది కంటి పరీక్షలను నిర్వహించుకున్నారన్నారు. తూప్రాన్ ఉమ్మడి మండలంలో 3,118 మంది, చేగుం ట మండలంలో 3,209మంది, నార్సింగి మండలంలో 3,981 మంది, వెల్దుర్తి మండలంలో 3,290 మంది కంటి పరీక్షలను ని ర్వహించుకున్నారన్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,674 మందికి కంటి అద్దాలను పంపిణీ చేయగా మరో 1,153 మందిని నగరంలోని దవాఖానలకు రెఫర్ చే శామన్నారు.తూప్రాన్ మండలం జండాపల్లికి చెందిన ముగ్గురికి ఆ పరేషన్‌లను చేయించామని అ రుణశ్రీ తెలిపారు.

కోనాయిపల్లి(పీబీ)లో
కంటివెలుగు కార్యక్రమానికి ప్ర జల నుంచి చక్కని స్పందన లభిస్తుంది. తూప్రాన్ మండలం కో నాయిపల్లి(పీబీ)లో మంగళవా రం నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమంలో 221 మంది కం టి పరీక్షలను చేయించుకున్నా రు. పీహెచ్‌సీ డాక్టర్ విశాల్, సూ పర్‌వైజర్లు శ్రీనివాస్, సంపతి, దుర్గారెడ్డి, కుమార్,ఏఎన్‌ఎంలు వెంకటలక్ష్మి, శ్యామల, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

4259మందికి పరీక్షలు
చేగుంట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది. నార్సింగిలో 19రోజులుగా నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం వరకు4250మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా, 574 మందికి అద్దాలు అందజేశారు. ఇంకా 1042మందికి అందించవల్సి ఉందన్నారు. 387మందికి శస్త్ర చికిత్త్సలు అవసరం ఉందని డాక్టర్ మురళీధర్ తెలిపారు.

167
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...