నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు


Tue,September 11, 2018 11:16 PM

చిన్నశంకరంపేట : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని ఎంపీడీవో లక్ష్మణమూర్తి హెచ్చరించారు. మంగళవారం నార్సింగి మండలం జప్తిశివనూర్ కాశగిరిజన తండాలోని ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణానికి రూ.2లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా.. అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...