టీఆర్‌ఎస్‌కే మరోమారు పట్టం


Tue,September 11, 2018 02:39 AM

బెజ్జంకి: ప్రభుత్వం చేపట్టిన పథకాలతో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నరని, మరోమారు టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధ్దంగా ఉన్నరని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని రేగులపల్లిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికై మొదటిసారిగా మండలానికి వచ్చిన సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు, నాయకులు తరలివచ్చి డప్పు చప్పుళ్ల మధ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాయని, ప్రజలు సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మరోమారు ఆశీర్వదించాలని కోరారు. భారీ సంఖ్యలో ఊరంతా కదిలిరావడంపై రసమయి బాలకిషన్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, పార్టీ మండలాధ్యక్షుడు రావుల రామకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు జంగలి తిరుపతి, రాజమహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

148
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...