పోలింగ్ స్టేషన్లు పరిశీలించిన కలెక్టర్


Tue,September 11, 2018 02:15 AM

-ఈవీఎంలు భద్రపరిచేందుకు గోదాముల సందర్శన
-అవసరమైన జాగ్రత్తల కోసం అధికారులకు ఆదేశం
-రాజకీయ పార్టీలతో వినయ్‌కృష్ణారెడ్డి సమావేశం
జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 10 : అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంలను భద్రపరిచేందుకు అనువైన జిల్లా కేంద్రంలోని వ్యవసాయశాఖ గిడ్డంగులు (గోదాంలు), వివిధ పాఠశాలల్లోని పోలింగ్ స్టేషన్లను సోమవారం కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో స్ట్రాంగ్ రూంలు చాలా అత్యవసరం కావడంతో ఈవీఎంలు భద్రపరిచేందుకు ఎస్టిమెంట్ సిద్ధం చేయాలని సర్వేల్యాండ్ రికార్డు సహాయ సంచాలకులు కొండల్‌రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూం భద్రతతో పాటు రూంకు అవసరమైన జాగ్రత్తలు ఉండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని యశ్వంతపూర్ పోలింగ్ స్టేషన్‌ను పరిశీలించి ఓటర్ల జాబితా, చనిపోయిన వారి జాబితా, పెళ్లి అయి వెళ్లిపోయిన వారి జాబితాలను విడివిడిగా తయా రు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయ న వెంట ఆర్డీవో మధుమోహన్, జనగామ తహసీల్దార్ రమేశ్ తదితరులు ఉన్నారు.

పలు పార్టీల నాయకులతో సమావేశం
ఎన్నికల నేపధ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఓట రు జాబితాపై ఎలాంటి అనుమానం ఉన్నా వాటిని నివృ త్తి చేసుకోవాలని, తన పరిధిలోని నియోజకవర్గాల వారిగా ఓటరు జాబితాలో తొలగించాల్సిన పేర్లను, నమోదు చేయాల్సిన పేర్లతో జాబితా వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుమోహన్, రమేశ్, డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకుల పాల్గొన్నారు.

170
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...