జిల్లాకు రూ.29 కోట్లు నిధులు


Sun,September 9, 2018 11:35 PM

మెదక్, నమస్తే తెలంగాణ: మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్త్తుంది. ఇప్పటికే వందశాతం సబ్సిడీతో ఉచితంగా చేప పిల్లలు అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సమీకృత మత్స్యఅభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు, పనిముట్లు, పరికరాలు అందజేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి కృషి చేస్తుంది. సబ్సిడీపై వాహనాలను తదితర పరికరాలను అందించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ. 29 కోట్లు మంజూరు చేసింది. టాటా ఏస్‌లు, ద్విచక్ర వాహనాలు, ఫిష్ క్రేట్స్, చేపల వేటకు అవసరమైన వలలు, పలు పరికరాలను 75 శాతం సబ్సిడీతో త్వరలో ఎంపికైన లబ్ధిదారులకు అందజేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేగాకుండాచేపల మార్కెటింగ్‌కు సహాయ సహకారలు అందించడం, మౌలిక వసతులు కల్పించడం వంటివి ఈ పథకంలో ఉన్నాయి. ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు, మహిళా మత్స్య సహకార సం ఘాలు, మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాల్లో నమోదైన సభ్యులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా సంఘ సభ్యులు వ్యక్తిగతంగా, గ్రూపులకు సంబంధించి మొత్తం 23 రకాల కాంపోనెట్లు ఉండగా జిల్లాకు అన్ని రకాల కాంపోనెట్లు కలిపి మొత్తం 3,726 యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది.

75 శాతం సబ్సిడీ..
జిల్లాలో చేపల పెంపకానికి అనువైన రెండు జలాశయాలతో పాటు 1,591 చెరువులు ఉన్నా యి. జిల్లా వ్యాప్తంగా 231 మ త్య్సపారిశ్రామిక సహకార సంఘా లు ఉండగా మొత్తం 13, 050 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 13 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో పురుషులు 12,500, మహిళలు 550 మంది ఉన్నారు. వీరిలోఎంపికైన వారికి పరికరాలు అందజేయనున్నారు. గత నెల 25వ తేదీన కలెక్టరేట్‌లో లాటరీ ద్వారాఎంపికైన లబ్ధిదారులు 25 శాతం చెల్లిస్తే ప్రభుత్వం 75 శాతం సబ్సిడీని అందించనుంది. 150 టాటా ఏస్‌లు, 3007ద్విచక్ర వాహనాలు మంజూరు కాగా 18 సంవత్సరాలు, వాహన లైసెన్స్‌లు కలిగి ఉన్నవారే అర్హులుగా గుర్త్తించారు.
6,894 దరఖాస్తులు..
గత నెలలో ్ల కలెక్టరేట్‌లో పథకం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన 3,726 యూనిట్ల కంటే అధికంగా 6,894 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కక్కరికీ రెండు, మూడు పరికరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో దరఖాస్తులు పెద్ద మొత్తంలో రావడంతో లాటరీ పద్ధ్దతిన అర్హులైన 3,290 లబ్ధిదారులను ఎంపిక చేశారు.
చేప పిల్లలు సిద్ధ్దం..
జిల్లాలో ఈ ఏడాది 4.58 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో వర్షాలు కురువక పోవడంతో చెరువులలోకి నీరు రాలేదు రాయినిపల్లి ప్రాజెక్ట్‌లో కొద్దిపాటి నీరు రావడంతో గత నెలలో 2.34 లక్షల చేప పిల్లలు మాత్రమే వదిలారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...