పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం


Sun,September 9, 2018 11:35 PM

రామాయంపేట: మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి నిజాంపేట మండల చైర్మన్ బిజ్జ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామిలు పేర్కొన్నారు. ఆదివారం నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామన్నారు. 60 ఏండ్ల కాలంలో జరుగని అభివృద్ధి మూడేండ్లలోనే డిప్యూ టీస్పీకర్‌గా తనదైన శైలిలో చేసి చూపించారన్నారు. ఈ సమావేశంలో నందిగామ ఎంపీటీసీ బిజ్జ లక్ష్మీదాసు, మాజీ సర్పంచ్ ఆకుల బాలయ్య, బ్రహ్మచారి, బాదె తిర్మలయ్య, బుచ్చ నర్సింహులు, కట్ట శ్రీనివాస్, బాదె సిద్ధిరాములు, అంబటి నర్సింహులు, బిజ్జ సురేశ్ ఉన్నారు.
పద్మాదేవేందర్‌రెడ్డిని కలిసిన గంగపుత్రులు
మెదక్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని ఆదివారం నిజాంపేట మండలానికి చెందిన గంగపుత్ర సంఘం నాయకులు హైదరాబాద్‌లోని ఆమె స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చల్మెడ దేవస్థానం చైర్మన్ ఆకుల మహేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ కాలూరి భాస్కర్‌రావు, గంగపుత్ర సంఘం నియోజకవర్గ కన్వీనర్ స్వామి, బాజ దుర్గయ్య, నర్సయ్య, మల్లయ్య, రమేశ్, హన్మంతు, భూదయ్య తదితరులు ఉన్నారు.

203
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...