మహనీయుడు కాళోజీ


Sun,September 9, 2018 11:33 PM

మెదక్ కలెక్టరేట్: తెలంగాణ భాషా అస్తిత్వాన్ని కాపాడిన మహనీయుడు కాళోజీ అని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అనేక ప్రాంతాల్లో అనేక రకాలైన యాస, భాష ఉంటుందన్నారు. తెలంగాణ యాసను చిన్న చూపు చూసే వారిని కాళోజీ తీవ్రంగా వ్యతిరేకించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని శాఖల్లో తెలుగులోనే కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగులోనే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అలాగే వస్త్రధారణ, నాగరికతలోనూ సమూల మార్పులు చోటు చేసుకోవడం బాధాకరం అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. కుటుంబం అంతా కలిసి పండుగలు జరుపుకునే పరిస్థితులు నేడు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నగేశ్, డీసీవో వెంకట్‌రెడ్డి, డీఎస్‌సీడీవో మహేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కలెక్టరేట్ ఏవో బలరాం పాల్గొన్నారు.

155
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...