సీఎం సభకు భారీ బందోబస్తు


Fri,September 7, 2018 12:36 AM

హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ పట్టణంలో శుక్ర వారం సీఎం కేసీఆర్ హాజరయ్యే ప్రగతి ఆశీర్వాద సభకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డులో బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారులకు సీపీ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ బహిరంగ సభకు సంబంధించిన బందోబస్తు డ్యూటీని 21 సెక్టార్లుగా విభజించామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 7మండలాల నుంచి 60 వేల వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులందరికీ ఇచ్చిన కమ్యూనికేషన్ సెట్లలో 12 చానళ్లలో ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అలర్టుగా ఉండి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ అండ్ పార్కింగ్ డ్యూటీలో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండి బాధ్యతలు నిర్వహించాలన్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలను ఒక క్రమపద్ధతిలో పెట్టించాలన్నారు. సీఎం కేసీఆర్ వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు నిలుపకుండా డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది చూసుకోవాలన్నారు. సభకు వస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బందోబస్తు చేయాలని సూచించారు. పోలీసు అధికారులు డ్యూటీలో ఉన్న ప్రదేశంలో చుట్టు పక్కల క్షుణ్ణంగా గమనించాలన్నారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బంది సభ అయిపోయి ప్రజలందరూ వెళ్లిపోయిన తర్వాత అధికారులు వెళ్లాలన్నారు.

220
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...