పోటీ పరీక్షలతోనే విద్యార్థుల మెదడుకు పదును

Fri,December 13, 2019 11:32 PM

మరిపెడ నమస్తేతెలంగాణ: పోటీ పరీక్షలతోనే విద్యార్థుల మెదడుకు పదునని మరిపెడ సీఐ ఎం.కరుణాకర్‌ అన్నారు. శుక్రవారం మరిపెడ మోడల్‌ స్కూల్ల్లో మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు 13, 14 తేదీల్లో వ్యాసరచన, వకృత్వ, చిత్ర లేఖనం, చర్చ, స్పెల్‌బీ, క్విజ్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీఐ కరుణాకర్‌ హాజరయ్యారు. మొదటి రోజు విజేతలైన విద్యార్థులకు మెమోంటోలను అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొని ఉన్నత స్థానాలను అందుకోవాలని సూచించారు. మీ పై మీ మీ తల్లితండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోని ఉన్నారని వారి ఆశలను వమ్ము చేయొద్దన్నారు. ఇష్టంతో కష్టపడి చదివి పైకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రేమ్‌కుమార్‌, ఆ పాఠశాల ఎస్‌ఎమ్మెసీ చైర్మన్‌ గండి విష్ణు, స్కూల్‌ టీచర్లు పాల్గొన్నారు.

200
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles