కేవైపీవై ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థి ప్రతిభ

Fri,December 13, 2019 12:25 AM

ఖమ్మం ఎడ్యుకేషన్‌: జాతీయస్థాయి పోటీ పరీక్ష అయిన కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహక్‌ యోజనా (కేవైపీవై) ఫలితాల్లో ఖమ్మంలోని శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల విద్యార్థి బీ.నిఖిల్‌ ప్రతిభ కనబర్చి ఎంపికైనట్లు తెలంగాణ శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్‌ మల్లెంపాటి శ్రీవిద్య గురువారం తెలిపారు. సుమారు 3 లక్షలమంది హాజరయ్యే ఈ ప్రతిభా పరీక్ష ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఏటా నవంబర్‌లో నిర్వహిస్తుందని అన్నారు. ఈ ఏడాది ఈ పరీక్షలో తమ విద్యార్థి నిఖిల్‌ ప్రతిభ చూపినట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థికి ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.9 వేల వరకూ స్కాలర్‌షిప్‌ వస్తుందని అన్నారు. సైన్స్‌ రీసెర్స్‌కు సంబంధించిన ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉండే ఇంతటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి తమ విద్యార్థి మాత్రమే ఎంపికైనట్లు వివరించారు. ఈ సందర్భంగా నిఖిల్‌ను కళాశాల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాయిగీతిక, డీజీఎం సత్యనారాయణ, డీన్‌ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, ప్రకాశ్‌, గోపాలకృష్ణ తదితరులు అభినందించారు.

212
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles