అనుముల రాంరెడ్డికి ‘ఉత్తమ విత్తనోత్పత్తి ’ రైతు అవార్డు

Fri,December 13, 2019 12:24 AM

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ: రూరల్‌ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన రైతు అనుముల రాంరెడ్డికి గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పార్థసారధి చేతుల మీదుగా ఉత్తమ విత్తనోత్పత్తి రైతు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రాంరెడ్డి మాట్లాడుతూ..తనకు వచ్చిన ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. రసాయనిక సాగుకు స్వస్తిపలికి సేంద్రియ సాగు పై రైతులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌. కేశవులు తదితరులున్నారు.

205
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles