హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Tue,December 10, 2019 01:07 AM

మామిళ్లగూడెం: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రవేశాలకు అర్హత ఉన్న ఎస్సీ కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సోమవారంఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యార్థులకు 1వతగరతిలో ప్రవేశాలు కల్పించి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హతలు ఉన్న ఎస్సీ విద్యార్థులు ఈనెల 23వ తేది సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులను జిల్లా ఎస్సీ అభివృద్ధ్ది అధికారి, డీఆర్‌డీఏ కాంప్లేక్స్‌ కార్యాలయంలో అందించాలని సూచిం చారు.

విద్యార్థుల వివరాలను బయోడేటా ఫారంలో నింపి దర ఖాస్తులకు నేటివిటి, పుట్టిన తేది, కులము, ఆదాయం సర్టిఫికేట్లు, ఆధార్‌, రేషన్‌ కార్డు జత చేసి అందించాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూన్‌ 1వతేది 2014 తరువాత లేదా మే 31వతేది 2015కు మందు జన్మించి ఉండాలన్నారు. తల్లి దండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతంలో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతంలో రెండు లక్షలకు మించి ఉండ కూ డదన్నారు. రెండు కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ఈనెల 27 వతేదిన బీఆర్‌ అంబేద్కర్‌ భవనంలో అభ్యర్థులను లా టరీ పద్ధ తిన ఎంపిక చేస్తామని తెలిపారు.వివరాలకు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles