అందరి అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్

Sat,December 7, 2019 12:09 AM

-63వ వర్థంతి కార్యక్రమంలో టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత నామా
ఖమ్మం నమస్తే తెలంగాణ, డిసెంబర్ 5: బాబా సాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గా ప్రజల అభ్యున్నతకి కృషి చేసిన మహనీయుడు అని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 63వ వర్థంతి సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ భవన్, పార్లమెంట్ భవన్ వద్ద వేర్వేరుగా జరిగిన అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాలలో టీఆర్‌ఎస్ ఎంపీలు, నాయకులతో కలిసి నామా పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించిన మాట్లాడారు. బహుజనుల మేలు కోరుతూ భారతదేశ ప్రజా నీకానికి దశ, దిశ నిర్ధేశిస్తూ రాజ్యాంగ రూపకల్పన చేసిన వ్యక్తి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమ న్యాయం కోరుతూ కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు.

ఆయన మార్గంలో నడవడం ద్వారా అన్ని రంగాల్లో అభ్యున్నతికి కృషి చేయటమే అంబేద్కర్‌కి ఘనమైన నివాళి అన్నారు. అంబేద్కర్ ఆశయాలు, లక్ష్యాలు ముందుకు తీసుకెళ్లే విషయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం, సాధనలో తెలంగాణ రాష్ట్రం ముందుదన్నారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలను అంబేద్కర్ సూచించిన మార్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామన్నారు. గృహ నిర్మాణం విషయంలో ప్రాధాన్యతనిస్తున్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ బిపి పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, రాములు, రంజిత్‌రెడ్డి, రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

321
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles