వైభవంగా ఆంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠ..

Sat,December 7, 2019 12:09 AM

-పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే సండ్ర, మువ్వా
కూసుమంచి, డిసెంబర్ 6: మండల పరిధిలోని పెరికసింగారంలో శుక్రవారం శ్రీఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు తదితరులతో పాటు వేలాది మంది భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించారు. వేదపండితులు శ్రీమాన్ చెవలూరి శ్రీనివాసమూర్తి, బొర్రా వాసుదేవాచార్యులు, చెవలూరి యోగానందాచార్యులు, రంగనాథాచార్యుల ఆధ్యర్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున స్వామివారి విగ్రహానికి సంప్రోక్షణ జరిపారు. అనంతరం మహిళలు విగ్రహానికి క్షీరాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. అగ్రహారం గ్రామానికి చెందిన నలజాల వీరభద్రం ఆధ్వర్యంలో హనుమాన్‌చాలీసా పారాయణం చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు గ్రామానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల నిర్వాహకులు గోపాల్‌రావు దంపతులు ఎమ్మెల్యే దంపతులకు శాలువాతో సత్కరించారు. అలాగే 9.30 గంటలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పూజలు నిర్వహించి, వేదపండితులతో ఆశీర్వచనాలు తీసుకున్నారు.

గోపాలరావుకు తుమ్మల శాలువా కప్పారు. అనంతరం 10 గంటల సమయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామానికి చేరుకుని పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వదాలు తీసుకుని, ఉత్సవాల నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ నాయకుడు, చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ జూకూరి గోపాల్‌రావు సుమారు రూ.6 లక్షల వ్యయంతో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. సుమారు 5 వేల మంది అన్నదానం చేశారు. ఈఉత్సవాల్లో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, జిల్లా రైతు సమన్వయకమిటీ కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు సాధు రమేష్‌రెడ్డి, మొగిలి శ్రీనివాసరెడ్డి, కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, జడ్పీటీసీ ఇంటూరి బేబీశేఖర్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామసహాయం బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి ఆసిఫ్‌పాషా, మాజీ వైస్ ఎంపీపీ బారి శ్రీనివాస్, ఎంపీటీసీలు మోదుగు వీరభద్రం, మాదాసు ఉపేందర్, వెంకటనారాయణ, సర్పంచ్‌లు వాసంశెట్టి వెంకటేశ్వర్లు, అరుణ, చెన్నా మోహన్,ముల్కూరి శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మల్లీడు వెంకన్న, వెన్నపూసల సీతారాములు, ఎమ్మెల్యే కందాల సోదరుడు కందాల సురేందర్‌రెడ్డి, డీసీ వెంకటేశ్వర్లు,రాంకుమార్, అహ్మద్ అలీ, గుండా దామోదర్‌రెడ్డి, బారి వీరభద్రం పాల్గొన్నారు.

299
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles