రైతు సంక్షేమానికి పెద్దపీట

Sat,December 7, 2019 12:08 AM

ఏన్కూరు, డిసెంబర్ 6: ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటను మధ్య దళారులకు అమ్మకుండా సీసీఐ కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొంది రైతు కుటుంబాలు ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. అన్నదాతలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ.. అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులకు ఎదురు పెట్టుబడి ఇస్తున్న ఎకైక రాష్ట్రం అని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని దీని ద్వారా ప్రజలు సుఖసంతోషాలతో జీవనం గడుపుతున్నారని అన్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అనంతరం మార్కెట్ యార్డ్‌లో ఉన్న పత్తిని పరిశీలించారు.

అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా లాలునాయక్, జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, డిప్యూటీ తహసీశీల్దార్ కొండపల్లి కృష్ణవేణి, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు, సొసైటీ సీఈవో సాంబశివరావు, రైతు సమన్వయ సమితి మండల అద్యక్షులు యండ్రాతి మోహన్‌రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాదావత్ బాలాజీ, ఎంపీటీసీలు శెట్టిపల్లి రాధమ్మ, చీరాల కృష్ణవేణి, వాసిరెడ్డి వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు బానోత్ సురేష్‌నాయక్, స్వర్ణప్రహ్లాదరావు, పార్టీ సీనియర్ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు ఆదిభాస్కర్‌రావు, పటాన్ మజీద్‌ఖాన్, కుసిన్ని రోశయ్య, మేడా దర్మారావు, భూక్యా బాలాజీ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

263
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles