భద్రాద్రి రామయ్యకు నిత్యకల్యాణం

Thu,December 5, 2019 11:41 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున ఆలయ తలుపులుతెరిచి స్వామికి సుప్రభాతసేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం చేసి, ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని లక్ష్మీతాయారు,అభయాంజనేయస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం బేడా మండపంలో రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు పాల్గొని తిలకించి పునీతులయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

278
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles