ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ

Thu,December 5, 2019 11:41 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: ఆర్టీసీ సమ్మెకాలంలో ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా ఒక్కొక్కరికి రూ. రెండు లక్షల చెక్కులను గురువారం సాయంత్రం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తన చాంబర్‌లో బాధిత కుటుంబాలకు అందజేశారు. ఖమ్మం డిపోకు చెందిన డీ. శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్‌ భార్య సావిత్రి, సత్తుపల్లి డిపోకు చెందిన డ్రైవర్‌ ఎస్‌కే ఖాజామియా భార్య ఎస్‌కే కరీమున్‌, కండక్టర్‌ కే. నీరజ భర్త రాజశేఖర్‌కు ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను కలెక్టర్‌ అందజేశారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు మృతులకు సంబంధించిన గ్రాట్యూటీ శ్రీనివాస్‌రెడ్డి డ్రైవర్‌ కుటుంబానికి రూ. 7లక్షల 13వేల 684, ఎస్‌కే ఖాజామియా డ్రైవర్‌ కుటుంబానికి రూ. 7 లక్షల 23 వేల 912, నీరజ కండక్టర్‌ కుటుంబానికి రూ.69వేల 113 అందించినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, సంబంధిత అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

283
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles