టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి..

Wed,November 13, 2019 02:14 AM

ఖమ్మం రూరల్‌, నమస్తేతెలంగాణ: టీఆర్‌ఎస్‌ పార్టీని మండలంలో తిరుగులేని శక్తిగా ఏర్పాటు చేయాలని పాలేరు ఎమ్యెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కూసుమంచి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో మండల కమిటీని ప్రకటించారు. మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులుగా బెల్లం వేణుగోపాల్‌, బాణోత్‌ రెడ్యానాయక్‌, ఉపాధ్యాక్షునిగా ముత్యం కృష్ణరావు, నల్లపునేని భాస్కర్‌రావులతో పాటు 25మంది కమిటీ సభ్యులతో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సెల్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా సీహెచ్‌ శ్రీనివాసరావు, బండి మల్లికార్జున్‌రావు, మండల యూత్‌ అధ్యక్ష,కార్యదర్శులుగా వెంపటి రవి, మందాటి ఉపేందర్‌రెడ్డి, ఉపాధ్యాక్షునిగా నాగండ్ల నాగేశ్వరరావు, ఎస్‌సీ సెల్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా బట్టుపోతల సతీష్‌, ఆరెంపుల బ్రహ్మం, ఎస్‌సీ సెల్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులుగా బానోత్‌ మెహన్‌,తేజావత్‌ ఎల్లయ్య నాయక్‌, మహిళా విభాగం మండల అధ్యక్ష, కార్యదర్శులుగా తద్దె పుష్ప, గొడ్డు గొర్ల నాగమణి, మైనార్టీసెల్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్‌కే. మహబూబ్‌ అలీ, షేక్‌ సైదులుతో పాటు ఆయా కమిటీలకు సభ్యులను ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాల మాట్లాడుతూ.. నూతన కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రానున్న కాలంలో వచ్చే ప్రతీ ఎన్నికల్లో క్రియశీలకంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో అందరిని కలుపుకుని పార్టీని నెంబర్‌వన్‌గా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీకి కార్యకర్తలే సైనికులని అన్నారు. అనంతరం నూతన మండలపార్టీ అధ్యక్ష, కార్యదర్శి, ఉపాధ్యాక్షులను, వివిధ విభాగాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులను రూరల్‌ ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్‌లు శాలువాతో సన్మానించారు.

263
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles