భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు

Mon,November 11, 2019 01:56 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి ముందుగా సుప్రభాత సేవ నిర్వహించారు. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, పుణ్యఃవచనం, నివేదన తదితర పూజలు గావించారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు రామాలయానికి చేరుకొని బారులు తీరి మరీ రామున్ని దర్శించుకున్నారు.

ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అర్చకులు ఆలయంలోని బేడా మండపంలో శ్రీసీతారామచంద్రమూర్తులకు ఘనంగా నిత్యకల్యాణం నిర్వహించారు. భక్తులు కల్యాణంలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు. ఈ సందర్భంగా అర్చకులు రాముని విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles