పల్లె పల్లెకూ ప్రజారవాణా..

Sun,November 10, 2019 12:10 AM

-ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఆగని ఆర్టీసీ సేవలు
-రద్దీకి అనుగుణంగా సర్వీసులు
-డిపో, బస్టాండ్ల వద్ద బందోబస్తు
-జిల్లాలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న సీపీ
ఖమ్మం కమాన్‌బజార్ : ప్రగతి చక్రాలు రోడ్డు బాట పట్టాయి.. ప్రయాణికులకు మేమున్నామంటూ భరోసాని కల్పిస్తూ వారి వారి ప్రాంతాలకు చేరవేశాయి. కార్మికులు సమ్మెలో ఉంటే ప్రయాణికులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామంటూ బస్సులు గ్రామాల్లో పరుగులు తీశాయి. కార్మికులు సమ్మె కారణంగా ప్రజారవాణా వ్యవస్థ కుంటు పడవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. జిల్లాలో తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రయాణికులను వారివారి ప్రాంతాలకు సురక్షితంగా చేరవేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం బస్సులు నడిపిస్తున్నా.. ప్రతిపక్షాలు పార్టీలు మాత్రం అడుగడుగున అడ్డగిస్తున్నాయి. అయిన్నప్పటికీ జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బస్సుల వివిధ రూట్లల్లో నడుస్తున్నాయి. జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారంతో 36వ రోజుకు చేరుకుంది. అధికారులు తాత్కాలిక సిబ్బందులను నియమించి బస్సులను ఆర్టీసీ షెడ్యూల్ ప్రకారంగా నడిపించాలనే సంకల్పంతో ఉన్నప్పటికి డిపోల ముందట బస్సులను అడ్డగిస్తునే ఉన్నారు. జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం, మధిర డిపోలల్లో అధికారులు బస్సులను తిప్పుతూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలను చేపడుతున్నారు.

వివిధ శాఖల నుంచి ఆర్టీసీకి కేటాయించిన ఉద్యోగులతో పాటు వివిధ డిపోలకు కేటాయించిన నోడల్ అధికారులు కూడా ప్రజా సేవలో మునిగి తేలుతున్నారు. వివిధ డిపోల్లో ఉదయం నుంచి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులు బస్సులను తిప్పారు. జిల్లాలో ప్రజా రవాణా వ్యవస్థపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఎప్పటికప్పుడు బస్సులను పనితీరును కలెక్టర్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. బస్టాండ్‌లల్లో వివిధ శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులు రద్దీని పర్యవేక్షిస్తూ డిపోల నుంచి బస్సులను తెప్పించి ప్రయాణికులను ఎక్కించి వారివారి ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం ఎక్కడా కూడా కనిపించని విధంగా అధికారులు బస్సులను నడిపించారు. జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, మధిర, డిపో, బస్టాండ్‌లల్లో ఏర్పాటు చేసిన బందోబస్తును పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సుల వెంట పెట్రోలింగ్ వాహనాలను పంపించాలని ఏసీపీ అధికారులను ఆదేశించారు. డిపోల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేసి ఆందోళన కారులు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ప్రశాంతంగా తిరుగుతున్న బస్సులు..
జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా బస్సులు జిల్లాలో ప్రశాంతంగా తిరుగుతున్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర డిపోలల్లో ఆర్టీసీ షెడ్యూల్డ్ ప్రకారంగా బస్సులను పంపిస్తూ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సులను ఆదనంగా ఏర్పాటు చేసి నడిపించారు. శనివారం ఉదయం 4 గంటల నుంచి ఆయా డిపోల పరిధిలో ఉన్న గ్రామాలకు, మండలాలకు బస్సులను ఏర్పాటు చేశారు. ఖమ్మం డిపో నుంచి భద్రాచలం, కొత్తగూడెం, హైదరాబాద్, సత్తుపల్లి, ఇల్లెందు, వరంగల్ తదితర ప్రాంతాలకు బస్సులను నడిపించారు. ఖమ్మం డిపోలో డీలక్స్, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను దూరప్రాంతాలకు పంపించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, పల్లెవెలుగు బస్సులను ఇల్లెందు, బోనకల్, మహబూబాబాద్, గార్ల ప్రాంతాలకు తిప్పారు. సత్తుపల్లి డిపో నుంచి ఎక్కువగా విజయవాడ, హైదరాబాద్, శ్రీశైలం, వరంగల్‌కు నడిపారు. ఆడిపో నుంచి సూపర్ లగ్జరీలను, ఎక్స్‌ప్రెస్‌లను దూరప్రాంతాలకు నడిపించారు. పల్లెవెలుగు బస్సులను సత్తుపల్లి మండలంలో ఉన్న చుట్టూ ప్రక్కల గ్రామాలకు నడిపించారు. మధిర డిపోలో అదే తరహాలో నడిపించారు.

డిపో, బస్టాండ్లలో భారీ బందోబస్తు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడవద్దని పోలీస్‌శాఖ డిపో, బస్టాండ్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. డిపో, బస్టాండ్‌ల వద్ద ఏసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో బందోబస్తు కొనసాగుతుంది. డిపోల నుంచి బయటికి వచ్చే బస్సులకు పెట్రోలింగ్ వాహనం ఎస్కార్ట్‌ను ఉపయోగించి వివిధ ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఎప్పటికప్పుడు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తులో ఉన్న ఏసీపీలకు ఆదేశాలిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. బస్టాండ్‌లల్లో ఆందోళన కారులు లోపలికి రాకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. డిపోలలో కార్మికులు తాత్కాలిక సిబ్బందికి విధులకు అడ్డంకులు సృష్టిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

214
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles