విద్యార్థులతో ప్రమాదకర పనులు చేయించవద్దు..

Thu,November 7, 2019 12:37 AM

-గురుకుల పాఠశాలను సందర్శించిన న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: మండల పరిధిలోని తాళ్లమడలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడిన్షియల్ స్కూల్‌ను బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వినోద్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల భవనంపై సెల్‌టవర్ సిగ్నల్స్ సరిచేస్తున్న సిబ్బందికి సహాయం అందించేందుకు నలుగురు విద్యార్థులు ఎక్కారు. ఆ సమయంలో వచ్చిన అదిచూసి ఆ విద్యార్థులను పిలిపించి విచారణ నిర్వహించారు. వసతిగృహానికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్ తమను పంపించారని విద్యార్థులు తెలపగా ప్రమాదకరమైన ఇటువంటి పనులను విద్యార్థులతో చేయించవద్దని హాస్టల్ నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం విద్యార్థులకు అందించే వసతి, భోజన సౌకర్యాలను పరిశీలించారు. అదేవిధంగా హాస్టల్‌లో జ్వరంతో బాధపడుతున్న నలుగురు విద్యార్థులను గుర్తించి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలని హాస్టల్ ప్రిన్సిపాల్ మట్టా దేవజ్యోతికి సూచించారు. ఎలాంటి ఇబ్బందులున్నా తమను సంప్రదించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట కోర్టు సిబ్బంది ఉన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles