శోభాయమానం.. కార్తీక తొలి సోమవారం

Mon,November 4, 2019 11:59 PMఖమ్మం కల్చరల్, నవంబర్ 4: పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం కోటి పూజలతో భక్తులు పునీతులయ్యారు. జిల్లా వ్యాప్తంగా శైవ, వైష్ణవ ఆలయాల్లో తమ తమ ఇష్టదైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానంగా శివాలయాల్లో త్రినేత్రుడికి అభిషేకాలు చేసి తరించారు. శివ కేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసం అష్టమి తిధి, శ్రవణ నక్షత్రంతో సోమవారం కలిసి రావడంతో ఈ రోజుకు ప్రత్యేకత సంతరించుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రముఖ శ్రీభ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వసంతలక్ష్మి దంపతులు, కుమారుడు నయన్‌రాజ్‌లు స్వయంభు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

కార్తీక దీపాల వెలుగులతో ఆలయాలు దేదీప్యమానంగా వెలుగొందాయి. భక్తుల ఇండ్ల ముంగిట్లలో దీపాలను వెలిగించి, ఉసిరి, తులసీ చెట్ల పూజలు చేశారు. భక్తులు అత్యంత భక్తినిష్టలతో ఉపవాస దీక్షలు, కార్తీక సోమవార వ్రతాలు ఆచరించారు. గుంటు మల్లన్న ఆలయంతో పాటు, బ్రాహ్మణబజార్ శివాలయం, ఎన్‌ఎస్‌పీ నాగమల్లేశ్వరస్వామి ఆలయం, స్తంభాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, వేంకటేశ్వరస్వామి ఆలయం, రామాలయాల్లో భక్తులు పూజలు చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles