రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

Mon,November 4, 2019 11:57 PM

ఖమ్మం రూరల్, నమస్తే తెలంగాణ: పెట్రోల్ ట్యాంకర్ ఢీకొనడంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఖమ్మం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు... రూరల్ మండలం పొన్నేకల్లు గ్రామస్తుడు కొటి చిన్న క్రిష్ణయ్య(75), సమీప గ్రామమైన మద్దులపల్లి నుంచి సోమవారం తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై స్వగ్రామానికి తిరిగొస్తున్నాడు. గ్రామ శివారులోని మూలమలుపు వద్ద, ఎదురుగా సూర్యాపేట వైపు నుంచి అతి వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. తలకు బలమైన గాయాలవడంతో చిన్న క్రిష్ణయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. కేసును ఎస్‌ఐ వెంకట్రావ్ నమోదు చేశారు.

210
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles