ఓపెన్ సప్ల్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Mon,November 4, 2019 11:57 PM

ఖమ్మం ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం జిల్లా కేంద్రంలోని కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. పది పరీక్షలకు సంబంధించి మూడు పరీక్ష కేంద్రాల్లో 105మంది అభ్యర్థులకుగాను 63మంది హాజరయ్యారు. 42మంది గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలకు రసాయన శాస్త్రం సబ్జెక్ట్‌కు రెండు కేంద్రాల్లో 44మంది అభ్యర్థులకుగాను 31మంది హాజరయ్యారు. 13మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఈఓ మదన్‌మోహన్, డీఐఈఓ రవిబాబు, ఫ్లయింగ్ స్కాడ్ సభ్యులు శ్రీనివాస్, బి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీహరి తనిఖీ చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ అవధానుల మురళీకృష్ణ తెలిపారు.

183
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles