చింతకాని పీహెచ్‌సీకి జాతీయస్థాయి గుర్తింపు

Mon,November 4, 2019 11:56 PM

చింతకాని : జాతీయ కుటుంబ సంక్షేమం, ఆరోగ్య మిషన్, న్యూఢిల్లీ వారి సర్వేలో మండల కేంద్రంలో గల పీహెచ్‌సీకి ఉత్తమ నాణ్యతా ప్రమాణాలలో భాగంగా అవార్డు వరించిందని డాక్టర్ అల్లాడి నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో గత ఆగస్టు నెలలో ఇద్దరు సభ్యుల బృందం పీహెచ్‌సీలోని ఆరు విభాలను పరిశీలించారు. నూరు మార్కులకు గాను 80.8 మార్కులు సాధించిందని, సదరు అవార్డును న్యూఢిల్లీలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి చేతులమీదుగా అందిస్తారని ఆయన తెలిపారు. గతంలో చింతకాని పీహెచ్‌సీకొ కాయకల్ప అవార్డు కూడా వరించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవార్డు రావడంలో సహకరించిన స్థానిక జిల్లా సిబ్బందికి, అభివృద్ధిలో సహకరించిన మండలాధికారులు, ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles