గుంటి మల్లన్న సేవలో మంత్రి అజయ్ దంపతులు..

Mon,November 4, 2019 11:56 PM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : మాసాలన్నింటిలోనూ శ్రేష్టమైనది, శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సప్తమి తిథిలో, శ్రవణ నక్షత్రం కలిగి ఎంతో విశిష్ట రోజు కోటి సోమవారం పురస్కరించుకుని ట్రంక్ రోడ్‌లోని శ్రీశ్రీ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వరస్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పువ్వాడ వసంతలక్ష్మి, కుమారుడు నయాన్‌రాజ్, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు దగ్గరుండి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట ఉమ, కనకం లక్ష్మి, ఆలయ చైర్మన్ ఆకుల సతీష్, కొత్త వెంకటేశ్వర్లు, పసుమర్తి రాంమోహన్, బచ్చు మురళీ, భద్రయ్య తదితరులు ఉన్నారు.

177
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles