రూ.8.10 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Sun,November 3, 2019 11:47 PM

పాల్వంచ: రూ.8.10లక్షల విలువైన 54 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ కేఆర్‌కే ప్రసాద్ వెల్లడించిన వివరాలు... పాల్వంచ పట్టణంలోని ప్రియదర్శిని కాలనీకి చెందిన ఉప్పుగండ్ల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీలేరు నుంచి రూ.8.10లక్షల విలువైన 54 కేజీలకు పైగా ఉన్న గంజాయిని తన కారు (ఏపీ 10ఎఎస్-3642)లో మహారాష్ట్ర ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇతడు, గత రెండేళ్లుగా ఇదే పని చేస్తున్నాడు. సీలేరులో కిలో గంజాయిని మూడువేల రూపాయలకు కొనుగోలు చేసి పాల్వంచకు తీసుకొచ్చి దాస్తున్నాడు. అదును చూసుకుని విజయవాడ, ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని వారికి కిలో గంజాయిని పదివేల రూపాయలకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలోనే, రెండు నెలల క్రితం ఖమ్మం రూరల్ మండలానికి చెందిన ఒకడు పరిచయమయ్యాడు.

అతడి ద్వారా, మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారితో ఉప్పుగండ్ల ప్రసాద్‌కు పరిచయం ఏర్పడింది. సీలేరు నుంచి తెచ్చిన గంజాయిని రెండు నెలల్లో రెండుసార్లు మహారాష్ట్ర వ్యాపారికి కిలో రూ.15వేల చొప్పున ఉప్పుగండ్ల ప్రసాద్ అమ్మాడు. 54 కేజీల 845 గ్రాముల గంజాయిని పాల్వంచకు తీసుకొచ్చి, అక్కడి నుంచి మహారాష్ట్రకు కారులో తరలిస్తున్నాడని అందిన సమాచారంతో పోలీసులు నవభారత్ సెంటర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. అలా ఈ గంజాయి కారు పట్టుబడింది. గంజాయిని, కారును పోలీసులు సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ పి.నవీన్, పట్టణ ఎస్సై జలకం ప్రవీణ్, అదనపు ఎస్సైలు రామారావు, తిరుపతి, రాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

201
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles