సత్తుపల్లి పట్టణాభివృద్ధే ప్రధాన ధ్యేయం

Sun,November 3, 2019 11:47 PM

సత్తుపల్లి రూరల్ : సత్తుపల్లి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తమ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్‌లో రూ.70లక్షలతో నిర్మించతలపెట్టిన కమ్యూనిటీ హాల్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, పురపాలకశాఖామంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పట్టణానికి మరిన్ని అభివృద్ధి నిధులు తీసుకువచ్చి పట్టణాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యూపీఎస్ పాఠశాల లో రూ.20లక్షల అదనపు గదుల నిర్మాణం, వంటషెడ్డుకు కూడా త్వరలోనే పూర్తిస్థాయి భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వెంగళరావునగర్‌లో 1 నుంచి 7వ నెంబరు వీ ధుల్లో ఆయన పర్యటించి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని అతిత్వరలో పూర్తి చే స్తామని హామీ ఇచ్చారు.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తుపల్లి మునిసిపాలిటీని అన్నివార్డుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని సూచించారు. అన్ని వ ర్గాల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామాలు, పట్టణాల సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మట్టా దయానంద్ విజయ్‌కుమార్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, కూసంపూడి మహేశ్, తడికమళ్ల ప్రకాశ్‌రావు, షేక్ చాంద్‌పాషా, షేక్ జాన్‌బీ, దొడ్డాకుల గోపాలరావు, అద్దంకి అనిల్, నాయకులు పాల్గొన్నారు.

177
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles