కార్తీకమాస విశిష్టతను తెలుసుకోవాలి..

Sun,November 3, 2019 11:46 PM

-శ్రీరాంహిల్స్ కాలనీవాసుల వనమహోత్సవంలో మంత్రి అజయ్
రఘునాథపాలెం:కార్తీకమాస విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ఆదివారం ఖమ్మం నగరం గొల్లగూడెంలో గల చెరుకూరి వారి తోటలో శ్రీరాంహిల్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ వనమ హోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్నేహబంధాలు పెంపొందించుకోవడం నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. వనమహోత్సవంలో భాగంగా కాలనీ బాధ్యులు పిల్లలకు, పెద్దలకు మ్యూజికల్ చైర్స్, లెమన్‌స్పూన్ వంటి వివిధ రకాల ఆటలపోటీలను నిర్వహించారు.

పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఏసీపీ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు. మధ్యాహ్నం కాలనీవాసులంతా కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని కాలనీ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నగర ఏసీపీ వెంకట్రావ్, శ్రీరాంహిల్స్ సొసైటీ అధ్యక్షుడు బత్తినేని నాగప్రసాద్, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ కురువెళ్ల కాంతారావు, ఈసీ బాధ్యులు రామచంద్రరావు, కృష్ణమూర్తి, నాగార్జున, శైలజ, సత్యనారాయణరాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు మందడపు రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు చిన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

173
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles