శిక్షణలో ప్రతిభ కనబర్చినకానిస్టేబుల్‌ను అభినందించిన సీపీ

Sun,November 3, 2019 03:16 AM

ఖమ్మం క్రైం : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలో నార్కొటిక్, ట్రాకర్ రెండు విభాగంలో గోల్ట్ మెడల్ సాధించిన టామీ, రీనా డాగ్స్ ను పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అభినందించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆద్వర్యంలో ఆర్‌సీ కోర్సులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఉమ్మడి పది జిల్లాకు చెందిన డాగ్స్‌తో పాటు హ్యాండ్లర్ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో 10 రోజుల పాటు శిక్షణ పొందారు. వివిధ విభాగాల శిక్షణలో వ్యక్తిగత ప్రతిభ చూపిన హ్యాండ్లర్ కానిస్టేబుల్ డీ సురాజ్ కుమార్, ఎస్‌కే నాగుల్ మీరా ప్రధమ బహుమతి గోల్ట్ మెడల్ సాధించారు. ఖమ్మం జిల్లా ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ విభాగానికి చెందిన వీరిద్దరిని శనివారం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడీషనల్ డీసీపీ మురళీధర్, అడీషనల్ డీసీపీ (ఆడ్మీన్) ఇంజరావు పూజ, ఏర్ అడీషనల్ డీసీపీ మాధవరావు, ఆర్‌ఐ శ్రీనివాస్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

171
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles