పిడుగుపాటుకు దంపతుల మృతి పట్ల

Sun,November 3, 2019 03:16 AM

-ఎంపీ నామా దిగ్భ్రాంతి
ఖమ్మం, నమస్తే తెలంగాణ : కూసుమంచి మండలం కిష్టాపురంలో పిడుగు పాటు ఘటనతో భార్యాభర్తలు మరణం పట్ల లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముదిగొండలో ఇటీవల ముగ్గురు యువకులు మరణం, కారేపల్లి తదితర చోట్ల పిడుగుపాటు ఘటనలు మరువక ముందే, ఆ విషాదం నుంచి కోలుకోక మునుపే మరొక ఘటన జరగడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం సూచనలు కనిపిస్తే వ్యవసాయ పనుల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉడాలన్నారు. కిష్టాపురం బాధిత కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అధికారులు తక్షణం తదుపరి చర్యలు చేపట్టాలని ఫోన్‌లో అధికారులను ఆదేశించారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

180
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles