భద్రాద్రిలో నేటినుంచి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు

Fri,November 1, 2019 11:41 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం నుంచి మూడు రోజుల పా టు రాష్ట్రస్థాయి అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలు జరగ ను న్నాయి. ఇందుకోసం మైదానంలో రెండు ప్రత్యేక వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 120మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పోటీల నిర్వాహణకు సహక రించనున్నారు. సాయంత్రం3 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఈ పోటీలు ఫ్లడ్‌లైట్ వెలుగుల నడుమ జరగనున్నాయి.

166
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles