గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది

Fri,November 1, 2019 12:53 AM

నేలకొండపల్లి : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, అందులో భాగంగానే పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపడుతుందని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కోనాయిగూడెంలో టీఆర్‌ఎస్ మండల ప్రధానకార్యదర్శి కోటి సైదారెడ్డి నివాసానికి వచ్చిన ఆయన సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించాలన్నారు. గ్రామస్థాయి అధికారులు, మండలస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామంలో పందుల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలపడంతో వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉన్నం బ్రహ్మయ్య, కొడాలి గోవిందరావు, వజ్జా శ్రీనివాసరావు, మేకల వెంకటేశ్వర్లు, పాకనాటి సీతారామరెడ్డి, ఆనం వెంకటరెడ్డి, కోటి విజయ పాల్గొన్నారు.

191
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles