నేరానికి శిక్ష తప్పదనే భయం ఉండాలి

Thu,September 19, 2019 11:38 PM

ఖమ్మం క్రైం: నేరానికి శిక్ష తప్పదనే భయం ఉండేలా కోర్టు డ్యూటీ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు సమన్లు, వారెంట్లు తామీలు చేస్తూ, నేరారోపణకు సాక్ష్యాలను సేకరించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకోవాలని అడిషనల్ డీసీపీ(ఆడ్మీన్) ఇంజరావు పూజ అన్నారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ల విధివిధానాలపై శిక్షణ తరగతులను గురువారం ఖమ్మంలోని స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ... ప్రజలకు మరింత నమ్మకాన్ని పెంపొందించేందుకు నిబద్ధ్దతతో నాణ్యమైన సేవలు అందించేలా కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లు, ఐటీ కోర్ సిబ్బంది హేమనాథ్, బేగ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

163
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles