పుస్తక ప్రదర్శనలకు ఖమ్మం మంచి వేదిక

Thu,September 19, 2019 12:54 AM

-రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్..
రఘునాథపాలెం, సెప్టెంబర్18: ఖమ్మం పుస్తక ప్రదర్శనలకు ప్రయోగశాలగా మారిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలో శ్రీనివాస్ బుక్ ఎగ్జిబిషన్‌ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ పోత్సాహంతో జిల్లాలో పుస్తక ప్రదర్శనల ఏర్పాటు విస్త్రృతంగా జరుగుతోందన్నారు. ఈ ఏడాది జూన్ 22వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండే ఎండలో వారం రోజులు పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దానిని స్ఫూర్తిగా తీసుకొని ఒకేరోజు జిల్లావ్యాప్తంగా 140 ప్రభుత్వ పాఠశాలలో 140 పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మంలో శ్రీనివాస్ బుక్ ఎగ్జిబిషన్ స్టాల్ సంవత్సరం మొత్తం నిర్వహించే విధంగా చేపట్టడం హర్షనీయమన్నారు. మమత హాస్పిటల్ రోడ్డులో ఇటివల 3వేల పుస్తకాలతో స్వచ్చందంగా లైబ్రరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కలెక్టర్ ప్రోత్సాహంతో జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో మరో వంద పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్త ఐవీ రమణారావు, శ్రీనివాస్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజేశ్వరరావు, ప్రముఖ కవులు ప్రసేన్, సీతారాం, న్యాయవాది తిరుమలరావు, ఠాకూర్, రవి తదితరులు పాల్గొన్నారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles